ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్షకు త్వరలోనే రీనోటిఫికేషన్ జారీ కానుంది. 2016లో డిగ్రీ పరీక్షలు రాసిన వారి కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీనోటిఫికేషన్‌ను జారీ చేయాలని ఆలోచిస్తోంది. ప్రభుత్వం నుంచి పోస్టులపై స్పష్టత రాగానే రీనోటిఫికేషన్ జారీ చేయడం కోసం కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రీ నోటిఫికేషన్లో పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ పీజీ సెట్లకు ప్రిపేర్ అయ్యే వారు గ్రూప్-2 పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియక గ్రూప్స్‌కు ప్రిపేర్ కావాలా? పీజీ సెట్లకు ప్రిపేర్ కావాలా? అనే గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం పోస్టులను పెంచుతామని.. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి సమయం ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ శాఖల్లో పోస్టులను పెంచుతున్నారనేది స్పష్టత రాలేదు. కొన్ని శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపితే వాటిని ఆర్ధిక శాఖ ఆమోదానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆర్ధిక ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపించినప్పటికీ ప్రభుత్వం ఆయా పోస్టుల భర్తీ కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో పోస్టుల పెంపుపై స్పష్టత రాలేదు. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్ష తేదీని ఇప్పటి వరకు ప్రకటించ లేదు. ప్రభుత్వం పోస్టుల సంఖ్యను తేల్చితే వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీనోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులతోపాటు కొత్తగా వచ్చే దరఖాస్తులను కలుపుకొని ఎంత మంది ఉంటారు, వారికి ఎన్ని పరీక్షా కేంద్రాలు అవసరం అవుతాయి అనే అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుని తగిన ఏర్పాట్లను చేసుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more