'She Out!' Video Shows Student Lose Consciousness In School Official's Choke Hold

Student lose consciousness in school official s choke hold

Mack Burgess,Teachers Choke Hold, 15 year old girl student, lose, South Carolina high school, assistant principal, consciousness, assistant principal, chokehold

A South Carolina high school assistant principal is under investigation after police said he was captured on video restraining a 15-year-old student by placing her in a chokehold and holding her until she passed out.

ITEMVIDEOS: విద్యార్థిని, విద్యార్థిని తగవులో ఇరుకున్న ప్రిన్సిపాల్

Posted: 05/08/2016 12:16 PM IST
Student lose consciousness in school official s choke hold

ఇద్దరు ఆడవాళ్లు తగువు పడుతుంటే.. మధ్యలో వెళ్లకూడదని పెద్దలు చెప్పిన సూచనను మరిచాడో విద్యావేత్త. అలా ఎంటరైయ్యాడో లేదో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా తయారైంది పరిస్థితి. మరో అమ్మాయితో గొడవ పడుతున్న పదిహేనేళ్ల విద్యార్థిని విడిపించేందుకు ఆ విద్యార్థిని గొంతుదగ్గరపట్టుకొని లాగడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి పోయింది. ఇది కాస్త వీడియో రూపంలో బయటకు రావడంతో పెద్ద రచ్చగా మారి పోలీసుల వరకు వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  లండన్ లోని కింగ్ స్ట్రీ సీనియర్ హై స్కూల్లో మాక్ బర్గెస్ అనే అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు.

ఇద్దరు విద్యార్థినులు బాగా గొడవపడుతుంటే ఇతర విద్యార్థినులు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అనంతరం తమ చేతుల్లోని సెల్ ఫోన్లు బయటకు తీసి రికార్డు చేయడం మొదలు పెట్టారు. కానీ, వారిని విడిపించేందుకు ఏ ఒక్కరూ వెళ్లలేదు. దీంతో స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ మాక్ బర్గెస్ ఆ గొడవపడుతున్నవారి వద్దకు వెళ్లి తొలుత ఆపే ప్రయత్నం చేశాడు. ఆయన ఎంతగా మందలించినా వారు వినిపించుకోకపోవడంతో.. ఓ విద్యార్థినిని మెడదగ్గరపట్టుకొని గట్టిగా వెనక్కి లాగాడు. అలా కొన్ని అడుగుల దూరం వెనక్కిలాగుతూ వెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయింది.

ఈ వీడియో వెలుగుచూడంతో ఆ బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. అయితే, తొలుత ఆయనను అరెస్టు చేయాలని చెప్పిన కోర్టు అనంతరం కేవలం నోటీసులు మాత్రం జారీ చేస్తే సరిపోతుందని, వివరణ కోరాలని తెలిపింది. కానీ, ఆ బాలిక తల్లి మాత్రం ఆయనకు శిక్ష పడాలని అంటోంది. గత ఐదురోజులుగా తన కూతురు సస్పెండ్ అయ్యి ఇంట్లోనే ఉంటుందని, ఆ ప్రిన్సిపాల్ తన కూతురును ఈడ్చేసిన విధానం చూస్తుంటే ఓ తల్లిగా ఎంతో బాధకలుగుతుందని, కనీసం మెడ కూడా తిప్పలేకుండా ఉండి మెడిసిన్ వాడుతుందని చెప్పింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles