Suresh Raina May Break His IPL Attendance Record for Wife

Suresh raina could miss first ever match for a special reason

Suresh Raina,Raina wife,Raina Holland,Raina child,IPL 2016,Gujarat Lions,Chris Gayle,Gayle Blush

Gujarat Lions skipper Suresh Raina left for Holland after the game against Kolkata Knight Riders to be with his pregnant wife Priyanka.

ఐపీఎల్ మ్యాచ్ ను వదిలిన సురేష్ రైనా.. అభిమానులకు శుభవార్త..

Posted: 05/09/2016 09:59 PM IST
Suresh raina could miss first ever match for a special reason

భారత క్రికెటర్ సురేశ్ రైనా ఐపీఎల్ లోని ఒక మ్యాచ్ నుండి విరామం తీసుకోనున్నాడు. అయితే అది అభిమానులకు శుభవార్తే. అదేంటంటారా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి గుజరాత్ లయన్స్ జట్టుకు అయన వచ్చి చేరడం.. అంతలోనే ఆయనకు కెప్టెన్ గా బాద్యతలు దక్కడంతో ఆనందాల జల్లులో తడిసిముద్దవుతున్న రైనా ఒక బలమైన వ్యక్తిగత కారణంతో ఐపీఎల్ మ్యాచ్ నుంచి విరమణ పోందాలనుకుంటున్నాడు. ఐపీఎల్‌ లో  ఇప్పటికే ఆయన సారథ్యం వహిస్తున్న కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌ పాయంట్ల పట్టికలో అగ్రభాగన నిలువగా, అదే సమయంలో అతన్ని మరో స్వీట్‌ న్యూస్‌ ఊరిస్తోంది. అదేంటంటారా..?

రైనా తండ్రి కాబోతున్నడు. త్వరలోనే రైనా భార్య ప్రియాంక తమ మొదటి బిడ్డను ప్రవవించబోతున్నది. ఈ శుభసందర్భంగా అతను ఐపీఎల్‌ నుంచి విరామం తీసుకొని తన భార్యను కలిసేందుకు హాలాండ్‌ కు బయలుదేరాడు. 'హాలాండ్‌కు బయలుదేరాను. రేపు నా భార్యను కలువబోతున్నాను. ఇప్పుడు నాకెంతో ఎక్సైటింగ్‌గా ఉంది' అని రైనా తెలిపాడు. ఆదివారం కోల్‌కతా ఈడెన్స్ గార్డెన్స్‌లో నైట్‌ రైడర్స్ జట్టును గుజరాత్‌ టీమ్‌ చిత్తుగా ఓడించిన తర్వాత కెప్టెన్‌ రైనా ఈ విషయాన్ని మీడియాకు తెలిపాడు. అదేవిధంగా ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ, భార్య ఫొటోలను పోస్టుచేసి.. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Raina  Raina wife  Raina Holland  Raina child  IPL 2016  Gujarat Lions  

Other Articles