Footballer Bernardo Ribeiro, 26, dies after playing game in Brazil

Bernardo ribeiro death tragedy strikes football again

Bernardo Ribeiro, football, heart attack, brazil, Newcastle Jets, Romanian league, Friburguense, Nova Friburgo, Michael Bridges

Former Newcastle Jets attacking midfielder Bernardo Ribeiro has died from suspected heart problems in his native Brazil.

ఆట మధ్యలో కుప్పకూలిన మరో క్రీడాకారుడు..

Posted: 05/09/2016 09:24 PM IST
Bernardo ribeiro death tragedy strikes football again

ఫుట్ బాల్లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్లు తమ శక్తినంతా ధారపోసి అడుతున్న క్రీడలే వారిని దిగమింగుతున్నాయా..? అసలింతకీ ఈ విషాదాలకు కారణమేంటి అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్న విషయం తెలిసిందే. కామెరున్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ పాట్రిక్ ఎకింగ్ రొమేనియా క్లబ్ డినామో తరఫున విటోరల్ కాంటాంటా జట్టుపై మ్యాచ్ ఆడుతూ మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా మైదానంలోనే కుప్పకూలిపోయిన ఘటనను మరువక ముందే మరో యువ క్రీడాకారుడు కన్నుమూశాడు.

తాజాగా, బ్రెజిల్ కు చెందిన మరో యువ ఫుట్ బాల్ క్రీడాకారుడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ లో భాగంగా ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్ కు చెందిన బెర్నార్డో రిబిరో (26) స్టేడియంలో తీవ్రంగా అనారోగ్యానికి గురై ప్రాణాలు విడిచాడు. తొలుత స్టేడియంలో తీవ్ర అస్వస్థతకు లోనైన రిబిరోను స్థానిక వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన  చికిత్స కోసం రెక్రియోలోని ఆస్పత్రికి తరలించినా అతని పరిస్థితి విషమంగా మారడంతో శనివారం రాత్రి మృతి చెందాడు.  ఈ విషాద ఘటనపై ఫ్రిబర్గ్యూన్స్ క్లబ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారుడి ఇలా మృతి చెందడం తీరని లోటని పేర్కొంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles