స్నేక్ గ్యాంగ్ ను దోషులుగా తేల్చిన కోర్టు | Court will declare Judgement on Snake gang

Court will declare judgement on snake gang

Snake Gang, Hyderabad, RangaReddy Court, స్నేక్ గ్యాంగ్, హైదరాబాద్, రంగారెడ్డి

Rangareddy court will reveal final judgement on Hyderabad Snake Gang Tomarrow. Court consider all evidences on this case.

స్నేక్ గ్యాంగ్ ను దోషులుగా తేల్చిన కోర్టు

Posted: 05/10/2016 02:05 PM IST
Court will declare judgement on snake gang

పలు అఘాయిత్యాలకు పాల్పడిన ఫజల్ దయాని నేతృత్వంలోని స్నేక్ గ్యాంగ్ కేసుపై రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. తొమ్మిది మంది నిందితులలో 8 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. ఎనిమిది మందికి బుధవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. కాగా, 2014 జూలై నెలలో నగర శివారు ప్రాంతంలోని పహాడీషరీప్‌లో పాముతో బెదిరించి ఓ యువతిపై స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. బాధిత యువతి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో నిందితులు దయాని, ఖాదర్ బరాక్బ, తయ్యబ్ బసలమ, మహమ్మద్ పర్వేజ్, సయద్ అన్వర్, ఖజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్బ, సలామ్ హాండిలపై కోర్టు అభియోగ పత్రాలను పోలీసులు దాఖలు చేశారు. ప్రస్తుతం ఇందులో ఐదుగురు పిడియాక్టుపై జైలులో ఉండగా, మరో నలుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. పాములతో బెదిరించి 37 మందిపై అకృత్యాలకు పాల్పడిన ఈ స్నేక్‌గ్యాంగ్ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles