అంబానీ కూతురైనా, అడుక్కుతినే వాడికైనా లవ్ లో పడకతప్పదు.. ఆ లవ్ లో పడితే కలిగే ఫీలింగ్స్ ను అనుభవించతప్పదు అని ఓ తెలుగు సినిమాలో హీరో చెప్పే డైలాగ్. నిజమే రెండు అక్షరాల ఆ పదం కొన్ని జీవితాలను పూర్తి మార్చేస్తుంది. అయితే తాజాగా ఓ సిఎంగారి కూతురు లవ్ స్టోరీ అందరికి ఇంట్రస్టింగ్ గా మారింది. పోలీస్ కమీషనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు కావా.. మొగుళ్లు రారా అంటూ ఇడియట్ సినిమాలో చంటి అనే ఓ మామూలు కుర్రాడు చెప్పే డైలాగ్ కు విజిల్స్ పడ్డాయి. మరి అలాంటి సిట్యువేషన్ ఓ సిఎం కూతురి విషయంలో వస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా అలాంటి ఫీలింగ్ ను ఓ స్టోరీ రాస్తున్నాం..
ప్రేమ.. అదో ఫీలింగ్. జీవితంలో ఎదురయ్యే సంతోషం, దు:ఖంలాంటి ఓ ఫీలింగ్ కానీ దానికి హద్దులు లేవు. పలానా వ్యక్తిని చూస్తే.. పలానా టైంలో మాత్రమే ఇది జరుగుతుంది అని అనుకోవడానికి వీలులేదు. పదహారో ఏట ఈ ప్రేమమైకం కమ్మొచ్చు.. అరవై ఏళ్ల వయస్సులో అయినా ఆ ఫీలింగ్ కలగవచ్చు. అలాంటి పీలింగ్స్ కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూషకు కలిగింది. నిజానికి కేసీఆర్ కూతురు కాకపోయినా.. అమ్మాయి కష్టాన్ని తెలుసుకున్న ఓ తండ్రిలాగా ఆ కూతురును దత్తత తీసుకున్నాడు.
తల్లి పెట్టే వేధింపులు ఓ చిట్టి తల్లి కష్టాన్ని తెలుగు మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. అమ్మ అనే పదానికి అవమానకరంగా, అమానవీయంగా చేసిన ఆ తల్లి నుండి ఆ బాలికకు స్వేచ్ఛ లభించింది. హైదరాబాద్ లోనే ఈ ఘటన జరగడం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద స్పందించడం జరిగింది. స్వయంగా కేసీఆర్ ప్రత్యూష దగ్గరికి వెళ్లి, ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆస్పత్రికి లో ఆ అమ్మాయి అవసరాలను దగ్గరుండి తీర్చేలా చేశారు. అయితే అలా ఓ సైడ్ ఎపిసోడ్ నడుస్తుండగా.. మరో పక్క ప్రత్యూష లైఫ్ లో లవ్ ఎపిసోడ్ నడిచింది.
మీడియా ద్వారా ఫుల్ పాపులర్ అయిన ప్రత్యూషను పలకరించడానికి చాలా మంది వచ్చారు. అయితే అలా ఆ ఆస్పత్రి వేరే పని మీద వచ్చిన కర్నూలుకు చెందిన మద్దిలేటి రెడ్డి అనే వ్యక్తి ఆమెను పలకరించాడు. అలా ఓ రెండు రోజుల పాటు దగ్గరికి వెళ్లి పలకరించి. కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. దాంతో రెండు రోజుల పరిచయం కాస్త బలపడి.. ఒకరి నుండి ఒకరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఆస్పత్రి నుండి బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించిన తర్వాత కూడా ప్రత్యూషకు మద్దిలేటి రెడ్డి ఫోన్లు చేసేవాడు.
ఇద్దరి మధ్య దూరం రోజుల నుండి గంటల వరకు పడిపోయింది. చివరకు ఓ దశలో ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరూ ఇష్టపడుతున్నారు.. అందునా మద్దిలేటి ఇంట్లో వాళ్ల అమ్మను కూడా ఒప్పించాడు. దాంతో ప్రత్యూష తాను చదువుకోలేనని.. పెళ్లి చెయ్యాలని పట్టుబట్టింది. దాంతో విషయం కేసీఆర్ కు తెలిసింది. ఆ వార్త మీడియాలో హైలెట్ అయింది. కేసీఆర్ మాత్రం ఆ అమ్మాయి చిన్న పిల్ల అని వెంటనే పెళ్లి ఏంటా అని అడిగినట్లు తెలిసింది. అయితే అమ్మాయి విషయం ఏమున్నా కోర్టు పరిధిలో ఉన్నందున దీని మీద ఎవరూ స్పందించడం లేదు. అయితే ఇక్కడ ఓ చిన్న విషయాన్ని గమనించాలి. ప్రేమ అనేది అంతస్తును బట్టి కాదు.. మనసు అంతరాల నుండి వస్తుంది అని. కానీ ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఏంటంటే అంతా పర్ ఫెక్ట్ గా ఉంటే సరిపోతుంది కానీ అలా కాకుండా మధుప్రియలాగా అయితే మాత్రం అందరి నుండి మాట కాయాల్సి వస్తుంది. సిఎంగా మిస్టర్ పర్ ఫెక్ట్ అని అనిపించుకున్న కేసీఆర్.. తన కూతురు విషయంలో కూడా అలానే చేస్తారా అని చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more