India Asks Interpol For International Arrest Warrant Against Vijay Mallya

Ed asks interpol to issue red corner notice against him

Enforcement Directorate, Vijay Mallya, Red corner notice Vijay Mallya, Vijay Mallya deportation, UK, UK declines India's request to deport Mallya

A day after the UK refused to deport Vijay Mallya, the ED requested the Interpol to issue a Red Corner Notice against the fugitive liquor baron.

విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసుకు ఈడీ సిఫార్సు..

Posted: 05/12/2016 02:51 PM IST
Ed asks interpol to issue red corner notice against him

భారతలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పన్నంగా అప్పులుగా తీసుకుని చివరాఖరున బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త  విజయ్ మాల్యాకు కొత్త చిక్కు ఎదురు కాబోతుంది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిఫార్పు చేయనుంది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి, మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.

మరోవైపు విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఒక రోజు అనంతరం ఈడీ ఈ మేరకు ఇంటర్ పోల్ ను కోరాలని లేఖను రాసింది. బ్రిటెన్ మాత్రం తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. దీంతో మాల్యాను భారత్ కు రప్పించేందుకు ఇదోక్కటే మార్గంగా భావించిన ఈడీ ఈ మేరకు అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్ ను కోరింది. ఇంటర్ పోల్ కూడా ఎలాంటి మెలికలు లేకుండా మాల్యాపై ఈడీ ఇచ్చిన లేఖను పరిగణలోకి తీసుకుని అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన పక్షంలో అతడ్ని పట్టుకుని భారత్ కు అప్పగించే అవకాశాలున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Enforcement Directorate  ED  red corner notice  Vijay Mallya  King Fisher  

Other Articles