Prompted by Renu Desai, Pawan Kalyan pays college girl's exam fee

Pawan kalyan pays college girl s exam fee

tollywood, pawan kalyan, power star helping a college girl, Laxmi Durga Degala, degree exam fee, renu desai, twitter, pawan kalyan exam fee, pawan kalyan helps college girl

Powerstar Pawan Kalyan once again proved his generosity by helping a college girl by paying her exam fee. The actor paid Rs.4,000 for the degree student who is in hardships.

మానవత్వం మూర్తిభవించిన మంచి మనస్సు.. పవన్ కల్యాన్..!

Posted: 05/12/2016 02:08 PM IST
Pawan kalyan pays college girl s exam fee

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ పేరు చెప్పగానే.. ఆయనను పవనిజం అంటూ కొందరు కీర్తిస్తుండగా, మరికోందరు మాత్రం ఏకంగా ఆయనను దేవుడంటూ అభిమానాన్ని చాటుకుంటారు. అంతటి గొప్పతనం ఏముందతనిలో అనేవాళ్లు లేకపోలేదు. తన సిబ్బంది వేతనాలను చెల్లించడానికే తన వద్ద డబ్బులు లేవని, బాహాంటగానే చెప్పిన ఆయన అంత ఇబ్బందుల్లో వున్నా.. ఓ అమ్మాయికి ఎగ్జామ్ ఫీజు కట్టి తన ఉదారతత్వ్తాన్ని, దయాగుణాన్ని, కురుణరసాన్ని చూపించాడని తెలిస్తే.. వాళ్లు కూడా ఔననకుండా పోతారా.

అయితే ఏ ఒక్కరి మన్ననలు పోందడానికో, లేక ఎవరికో తన గురించి తెలియజేయడానికో కాదు.. తన తత్వమే అది, తన మనస్సే అలా చేయాలని చెబుతుంది.. తనకు ఎవరు కష్టాన్ని చూసినా ఓర్చుకోలేనని గతలో పలు సందర్భాలలో చెప్పిన పవన్.. ఎవరికి ఎంత చేసినా.. అది గొప్యంగానే వుంచుతారు. కాకపోతే.. అయన మాజీ సతీమణి రేణు దేశాయ్.. మూలంగా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదెలా అంటారేమో.. అమెకు మాత్రం ఇలాంటి విషయాలు ప్రచారం చేయడం.. పవన్ అభిరుచికి విరుధ్దంగా నడుచుకోవడం ఇష్టం లేదు. అయితే అమె ట్విట్టర్ అకౌంట్ లో సదరు యువతి ధన్యవాదాలు చెప్పడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

లక్ష్మీదుర్గా డేగల అనే యువతి గత కొంతకాలం క్రితం తన తండ్రిని పోగోట్టుకుంది. అయినా పట్టువదలకుండా తమ జీవితాలు బాగుపడాలంటే విద్య అవసరమని ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. సరిగ్గా పరీక్ష సీజన్ రాగానే అమె పరీక్ష పీజు కట్టలేకపోయింది. ఈ తరుణంలో అమె తన స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో సాయం కోసం ఎవరైనా దాత ముందుకు రావాలని అశిస్తూ అభ్యర్థనను పెట్టింది. అమె ఆశ్రయించిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఎవరు ముందుకు రాలేదు. దీంతో అమె అశలు అడియాశలయ్యాయి.

దీనిని ఎలాగో తెలుసుకున్న పవన్ కల్యాన్ మాజీ సతీమని రేణుదేశాయ్.. లక్ష్మీదుర్గ గురించి వివరాలను తెలుసుకుని అమెకు సాయం చేస్తానని అభయాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని తన మాజీ భర్త పవన్ కల్యాన్ తో చెప్పడంతో ఆయన వెనువెంటనే లక్ష్మీదుర్గా కాలేజీకి తన మనుషులను పంపించి పరీక్ష ఫీజు కట్టించారు. ఆ యువతి పరీక్షలను రాసిన తరువాత మరీ మరీ రేణుదేశాయ్ తో పాటుగా పవన్ కల్యాన్ కు కూడా తన ధన్యవాదాలను తెలిపింది. అది కూడా సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారానే. అది కాస్తా వాళ్లు వీళ్లు షేర్ చేసుకోవడంతో మీడియాకు సమాచారం అందింది. ఇలా పవన్ చేసిన మంచి పనికి.. తాను వ్యతిరేకించే ప్రచారం లభించింది. అందుకే మానవత్వం పరిమళించే మంచి మనస్సులు.. వారి దాతృత్వాలను గోప్యంగా వుంచినా.. వారు మాత్రం కలకలం సుఖంగా వర్థిలాలని కోరుకుందాం..

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  college girl  Laxmi Durga Degala  degree exam fee  renu desai  twitter  

Other Articles