ఏ రాష్ట్ర ఎన్నికలు చూసినా ఏమున్నది గర్వకారణం.. చేతికి నోటు.. నోటికి సీసా.. ఇదేనా నా భారత దేశ ప్రజాస్వామ్యం.. డబ్బున్న నేతలకే అధికారం దాసోహం అంటూ నేటి తరం కవులు అనేక సినిమాలలో డైలాగులు రచించినా.. ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఎన్నికలను ప్రజలు పండగ వచ్చిందనుకునే పరిస్థితిని నుండి బయటపడి.. ఇప్పుడే తమకు అధికారం వచ్చిందని భావిస్తే.. నేతల తలరాతలు మారుతాయ. ప్రజల జీవితాలు బాగుపడతాయ్. ప్రజలు కరువుకాటకాలతో కాలం వెల్లదీస్తుంటే.. నేతలు మాత్రం కోట్లకు కోట్ల రూపాయలను ఇప్పుడే బయటకు తీసి ఖర్చుచేస్తున్నారు. ప్రజలకు నోట్లను తాయిలాలుగా వెదజల్లి ఓట్లను కొంటున్నారు. నేతలకున్న డబ్బబు జబ్బుతో ఎన్నికలలో గెలిస్తే.. వారు ప్రజాహిత కార్యక్రమాలకు నుడుం చుడతారా..? లేక ఖర్చు చేసిన సొమ్మకు పదింతలు సంపాదించేందుకు తమ సమయాన్ని వెచ్చిస్తారా.. ప్రజలకే తెలియాలి.
ఇప్పడీ ఉపోద్ఘాతం ఎందుకంటారా..? ఇవాళ సాయంత్రంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ప్రచార ఘట్టానికి తెరపడనుంది, ఇక తెరచాటుగా సాగే అనేక అక్రమాలకు తెరలేవనుంది. ప్రజాస్వామ్యాన్ని కొనుకునేందుకు నేతలు తమ నోట్లతో పోటీ పడుతుంటారు. విచ్ఛలవిడిగా తమ సోమ్మును విధిల్చి ఎలాగైనా గెలవాలని చూస్తుంటారు. దక్షిణాధి రాష్ట్రాలలో ఎక్కడా లేనంతగా ఎన్నికల ధన ప్రవాహం తమిళనాడులో చేటుచేసుకుంటుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నికల అధికారులు కోట్లాది రూపాయిలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వంద కోట్ల మేర నగదు ఇప్పటకే అధికారులు సీజ్ చేశారు.
తాజాగా ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన తనిఖీలలో వందల కోట్ల రూపాయల భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గతరాత్రి తనిఖీల్లో భాగంగా కోయంబత్తూరు, తిర్పూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. కోయంబత్తూరు బైపాస్ రోడ్డు వద్ద ఓ కంటైనర్లో రూ.195 కోట్లు సీజ్ చేయగా, తిర్పూరు జిల్లాలో మూడు కంటైనర్లను ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ స్వాధీనం చేసుకుంది. ఆ కంటైనర్లలో రూ.570 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కంటైనర్లు కోయంబత్తూరు నుంచి విశాఖపట్నం తీసుకువెళ్తున్నామని, ఇంటర్ బ్యాంక్ మనీ ట్రాన్స్ ఫర్ కింద డబ్బును తరలిస్తున్నట్లు లారీ డ్రైవర్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై విచారణ జరుపుతున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.
కాగా ఈ కంటైనర్ల వెనక మూడు కార్లలో పలువురు వ్యక్తులు ఫాలో అవుతున్నారు. వారు తమను తాము ఆంద్రప్రదేశ్ కు చెందిన పోలీసులుగా చెప్పుకున్నారు. అయితే ఏపీకి చెందిన పోలీసులు తమిళనాడులోకి వెళ్లి డబ్బుకు భద్రతగా ఎందులకు వున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికారుల తనిఖీల కోసం వాహనాలను నిలుపుతుండగా, అదే మార్గంలోంచి వచ్చిన కంటైనర్లు ఎందుకు తనిఖీల కోసం అపకుండా ముందుకు వచ్చాయన్న ప్రశ్నలు కూడా రేకెత్తున్నాయి. ఇక ముఖ్యంగా బ్యాంకు నుంచి బ్యాంకుకు ఇంతపెద్ద మొత్తం తరలిస్తున్న క్రమంలో అందులోనూ ఎన్నికల కోడ్ అమలులో వున్న తమిళనాడులోంచి రవాణా చేస్తున్నప్పడు సరైన డాక్యుమెంట్లు లేకుండా ఎలా రవాణా చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, అధికారులు వాటిని చేజ్ చేసి పట్టుకుని వాటిని వున్న డబ్బును సీజ్ చేశారు. లారీలను తిరుపూర్ జిల్లా కార్యాలయానికి తరలించి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా ఈనెల 16వ తేదీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు యధేచ్చగా నగదు పంపిణీలో నిమగ్నమైపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తమిళనాడులో సుమారు రూ.100 కోట్లు అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత భారీగా నగదును సీజ్ చేయడం దేశంలోనే ప్రథమం. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more