Gaya road rage: Suspended JD(U) leader Manorama Devi surrenders, sent to 14-day judicial custody

Absconding jd u mlc manorama devi surrenders in a gaya court

Gaya road rage,Bihar,Manorama Devi,Rocky Yadav, youth shot dead, mlc surrenders, bindu yadav, cycle thief

"I have been wrongly framed. No liquor was ever recovered from my house. I am with the government," Manorama Devi said while being taken to court.

కోర్టు ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్సీ మనోరమాదేవి

Posted: 05/17/2016 11:14 AM IST
Absconding jd u mlc manorama devi surrenders in a gaya court

పుత్రుడు జనియించగానే పుత్రోత్సాహం కాదు.. వాడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చిన నాడే పుత్రోత్సాహం అంటూ పెద్దలు చెప్పిన విషయాన్ని రాకీ యాదవ్ మరిచాడు. అతను చేసిన పనివల్ల ఏకంగా ఒక ప్రాణం పోయింది. అంతేకాదు అతని మూలంగా అమె తల్లి పదవి పోయింది. అంతటితో అగలేదు.. అతని తల్లిని కటకటాల కూడా చేసింది. దానిని తప్పించుకోడానికి అమె పడ్డ పాట్లు అన్ని ఇన్నీ కావు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగి తిరిగి అలసిపోయిన అమె చివరకు చేసేది లేక కోర్టులో లొంగిపోయింది.

విదేశీ మద్యం అక్రమ నిల్వ కేసులో సస్పెండైన జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి మంగళవారం తెల్లవారుజామున గయ కోర్టులో లొంగిపోయారు. ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే.. అసలు తన ఇంట్లో విదేశీ మద్యం ఏమీ దొరకలేదని, తనను రాజకీయంగా ఇరికించాలనే ఇలా చేశారని మనోరమాదేవి అన్నారు. తాను నిరపరాధినని కోర్టు వద్ద మీడియాతో చెప్పారు. ఆమె కుమారుడు రాకేష్ రంజన్ యాదవ్ అలియాస్ రాకీ యాదవ్ గయ ప్రాంతంలో తన కారును ఓ యువకుడు ఓవర్‌టేక్ చేశాడన్న కోపంతో అతడిని కాల్చిచంపిన కేసులో నిందితుడు.

ఈ కేసులో మనోరమాదేవిని ప్రశ్నించేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా అక్కడ భారీ మొత్తంలో విదేశీ మద్యం సీసాలు లభించాయి. దాంతోపాటు, ఓ బాలకార్మికుడిని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నట్లు కూడా ఆమెపై కేసు పెట్టారు. తన కొడుకు రాకీ యాదవ్‌ను పోలీసులకు దొరక్కుండా దాచిపెట్టినందుకు సైతం మరో కేసు నమోదైంది. దీంతో చాలా కాలంగా పరారీలో ఉన్న మనోరమాదేవి.. ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gaya road rage  Bihar  Manorama Devi  Rocky Yadav  youth shot dead  mlc surrenders  bindu yadav  cycle thief  

Other Articles