Anandiben faces exit as BJP gears up for Assembly polls

Will anandiben patel be removed as the cm of gujarat

Gujarat Elections,Anandiben Patel,BJP,2017 Gujarat Elections,Nitinbhai Patel,Prime Minister Narendra Modi

The BJP is considering replacing Gujarat chief minister Anandiben Patel, sources said, as Prime Minister Narendra Modi and BJP chief Amit Shah craft a strategy to ensure that the party retains their home state in assembly elections next year.

గుజరాత్ సీఎంగా.. అనందిబెన్ పటేల్ ఔట్.. ?

Posted: 05/17/2016 11:56 AM IST
Will anandiben patel be removed as the cm of gujarat

వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలలో ఏ మాత్రం అజాగ్రత్త, ఏమరపాటుతో తమ పార్టీ అధికారానికి ఎదురుగాలి వీచినా.. అది కేంద్రంలోని ప్రభుత్వానికే ఎసరు తీసుకువస్తుందని కలవరపాటుకు లోనైన బీజేపి అధినాయకత్వం.. తభిన్నంగా పావులు కదుపుతుంది. గుజరాత్ రాష్ట్రంలో అధికార పగ్గాలు తమ నుంచి చేజారిపోకుండా, అందుకు తావులేకుండా మరోమారు అధికార పగ్గాలను అందుకోవాలని బీజేపి పలు మార్పులు, చేర్పులు చేయాడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అందుకు గుజరాత్‌లో.. ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌ను మార్చి కొత్త వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని అధికార బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు వ్యూహరచన చేస్తున్నట్లు చెప్తున్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు గెలిచిన ఈ రాష్ట్ర ఎన్నికలు పార్టీకి ప్రతిష్టాత్మకమైనవని.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కూడా అయినందున ఆ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని బీజేపీ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ముందే కసరత్తు మొదలుపెట్టిన అధినాయకత్వం పలు సమావేశాలు నిర్వహించి వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపాయి. అందులో భాగంగా ప్రస్తుత సీఎం ఆనందీబెన్ పటేల్‌ను వేరే రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించటం ద్వారా.. సీఎం పదవిని కొత్త వారికి అప్పగించేందుకు మార్గం సుగమం చేయాలని యోచిస్తున్నట్లు వివరించాయి. ఆమెను పంజాబ్ గవర్నర్‌గా నియమించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. కొత్త సీఎం రేసులో ముందున్న వారిలో నితిన్‌భాయ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అనందిబెన్ పటేల్ నుంచి ముఖ్యమంత్రి పదవిని వేరేవారికి ఇవ్వాల్సన నేపథ్యంలో ఎలాంటి అసమానతలకు తావులేకుండా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అందజేయాలని ఈ ద్వయం భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో ఏ మాత్రం ఏమరపాటు వున్న మరోమారు పేటల్ ఉద్యమం తెరముందుకు రావచ్చని, అలా జరిగితే మొదటికే మోసం వస్తుందన్ని పటేల్ వర్గానికి చెందన అమాత్యుడినే సీఎం పదవికి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహా పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న నితిన్‌భాయ్ గత వారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కూడా కలిశారు. అయితే ఇది సీఎం పదవి మార్పుకు సంకేతమన్న వార్తలకు తావిచ్చింది.

రెండేళ్ల కిందట సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనంతరం.. మోదీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆనందీబెన్‌ను మోదీ వారసురాలిగా ఎంపిక చేశారు. అయితే.. గత ఆగస్టులో రాష్ట్రంలో భారీ స్థాయిలో ముందుకొచ్చిన పటేల్ రిజర్వేషన్ల ఉద్యమంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బీజేపీకి రాష్ట్రంలో సంప్రదాయ ఓటు బ్యాంకుల్లో బలమైన ఓటు బ్యాంకు అయిన పటేల్ వర్గంతో సంబంధాలు ఆ ఆందోళనతో దెబ్బతిన్నాయి. పటేల్ ఉద్యమ నేతలతో చర్చలు జరిపిన ప్రభుత్వ బృందానికి నితిన్ సారథ్యం వహించినట్లు చెబుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Department of Health  Nitinbhai Patel  Cm anandiben Patel  PM Modi  

Other Articles