hitler and dictator chandrababu: former judge comments on AP CM

Justice laxman reddy slams chandrababu naidu commenting him as hitler

Andhra Pradesh, Ap sepecial status, former judge laxman reddy, chandrababu naidu, AP CM chandrababu, CBN, Hitler, Dictator, stae re organisation bill, sundaraiah vignana kendram, cpm

AP CM chandrababu is behaving like Hitler and Dictator, that is the reason why andhra pradesh didnt get special status even after included in stae re organisation bill

హిట్లర్ ను గుర్తుకు తెస్తున్న చంద్రబాబు..

Posted: 05/22/2016 09:19 AM IST
Justice laxman reddy slams chandrababu naidu commenting him as hitler

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన హిట్లర్ మాదిరి ఉండటమేగాక డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నందువల్లే రాష్ట్రానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందట్లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి విమర్శించారు. చట్టంలో పొందుపరచిన అంశాల్ని అమలు చేయాలని రెండేళ్ల తర్వాత కూడా మేధావులు కోరాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ పునర్విభజన చట్టం, హామీల అమలు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని విషయమై ఇటు కేంద్రప్రభుత్వం, అటు ప్రతిపక్షపార్టీలతో మాటమాత్రంగానైనా సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ర్టప్రభుత్వమే  చట్టాన్ని అతిక్రమించిందని విమర్శించారు. రాజధాని భూముల సేకరణలోనూ చంద్రబాబు ప్రభుత్వం నిబంధలను ఇష్టానుసారంగా మార్చి.. రైతన్నలను ఏమార్చి భూములను తీసుకుంటుందన్నారు. మా భూములు ఇవ్వమన్న రైతులను కూడా భయపెట్టి లాగేసుకుంటుందన్ని అవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు లాంటి జిమ్మికు ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడ వెతికినా దోరకడని సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. రాజధాని లేని రాష్ట్రం అన్న పేరుతో మొసలి కన్నీరు కార్చి.. అడపడచుల చేతి గాజులు, తాళిబోట్లు సైతం విరాళంగా పోందిన ముఖ్యమంత్రి.. తన విలాసాల కోసం మాత్రం కోట్లు ఖర్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. తొమ్మిది క్యాంపు ఆఫీసులకు సీఎం రూ.80 కోట్లు ఖర్చుచేసి రాజధాని కోసం ఇటుకలను విరాళాలుగా సేకరించడం విడ్డూరంగా ఉందని  రెవెన్యూ లోటు ఉందంటూనే వేలకోట్లు రుణమాఫీ ఏవిధంగా చేశారో చెప్పాల్సిన అవసరముందన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  Justice Laxman Reddy  Special status  Chandrababu  

Other Articles