Microsoft's Smartphone Chase Appears to Be Ending

Microsoft to cut 1850 jobs at struggling smartphone unit

Microsoft, Manufacture of smartphones, Software Products, Nokia, Smartphones, Mobile phones, Technology, Business

Microsoft Corp. announced plans to streamline the company’s smartphone hardware business, which will impact up to 1,850 jobs," it said in a statement.

అలవాటు లేని పనులకు స్వస్తి పలికింది..

Posted: 05/26/2016 12:34 PM IST
Microsoft to cut 1850 jobs at struggling smartphone unit

అలవాటు వున్న వ్యాపారంలోనే రాణించలేని సమయంలో..  అసలు అలావాటే లేని వ్యాపారాల్లోకి అడుగుపెట్టి లాభాలను అర్జించాలని అనుకోవడం పోరబాటే. అయితే ఈ పోరబాటు చేసి చేతులు కాల్చుకున్న తరువాత గానీ ఆకులు పట్టుకోవాల్సి వచ్చింది ఓ దిగ్గజ సంస్థకు. దీంతో ఆలస్యంగానైనా అలవాటు లేని పనులకు స్వస్తి చెప్పాలని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. ఒకవైపు ప్రత్యర్థుల నుంచి విపరీతమైన పోటీ.. మరొకవైపు లూమియా, విండోస్ ఫోన్ల వ్యూహాలు బెడిసికొట్టడంతో... స్మార్ట్‌ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

దీంతో రెండేళ్ల క్రితం నోకియా నుంచి 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ ప్రయోగానికి స్వస్తి పలకనుంది. అంతటితో అగకుండా ఏకంగా 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో నోకియా కంపెనీకి చెందిన 1350 మందిని కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. అదీగాక తమ సంస్థల పనిచేస్తున్న సుమారు 500 మందిని కూడా ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ నుంచి తొలగిస్తామని తెలిపింది. దీంతో ఇక నోకియా ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ వదిలించుకుంది.

స్మార్ట్‌ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్‌లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. అంటే కంపెనీ విండోస్-10 మొబైల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనుంది. మైక్రోసాఫ్ట్ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్‌ఐహెచ్ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ సంస్థలు నోకియా బ్రాండ్ మొబైళ్లను, ట్యాబ్లెట్స్‌ను సంయుక్తంగా తయారుచేసి విక్రయిస్తాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Microsoft  Manufacture of smartphones  Software Products  

Other Articles