విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ వారిలో ఒకరిపై కన్నేసి శారీరికంగా, మానసికంగా వేధిస్తే.. సరిగ్గా అలానే జరిగింది. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని మభ్యపెట్టి విద్యార్ధినులను లొంగదీసుకున్న కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు టీచర్ ఓ బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా గణపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాయి మణిదీప్ అనే ఫిజిక్స్ టీచర్ క్లాసులోని బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. టీచర్ కాబట్టి పిల్లలు చనువుగా ఉండటం సహాజం. అయితే ఇదే చనువుని ఆసరాగా చేసుకుని విద్యార్ధినిలపై రెచ్చిపోయాడు.
పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని వారికి మరింతగా దగ్గరయ్యేవాడు. ఈ క్రమంలో 9వ తరగతికి చెందిన ఓ బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి నెలరోజుల క్రితం వెంట తీసుకెళ్లాడు. అయితే కుమార్తె కనిపించకపోవడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలోని రాంనగర్‌కు చెందిన శివసాని మణిదీప్ (26) రికార్డును తిరగేసిన పోలీసులకు షాక్ తగిలింది.
అతడు 2011లో హన్మకొండలోని ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తూ అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డాడు. 2013లో కాశిబుగ్గకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి 14 నెలల కొడుకు ఉన్నాడు. 2014లో హుజారాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ బాలికలను మానసికంగా వేధించడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మణిదీప్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత కీర్తి మార్కెటింగ్ కొరియర్ సర్వీసులో పనిచేస్తూ 1.28 లక్షల విలువైన ధనలక్ష్మీ యంత్రాలను కాజేసినందుకు ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతడిపై రౌడీషీట్ తెరుస్తామని వరంగల్ ఏఎస్పీ విశ్వజిత్ తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more