డబ్బు కోసం మహిళలే కిడ్నాపర్ల అవతారం ఎత్తారు. ఆ ముగ్గురు కలిసి ఓ మహిళను కిడ్నాప్ చేశారు. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టసాగారు. డబ్బు కోసం ఆమె సోదరుడికి బెదిరింపు కాల్స్ చేశారు. కానీ, అక్కడే ఓ చిన్నపొరపాటుతో పోలీసులకు చిక్కి జైల్లో పడ్డారు. దుబాయ్ లో గతేడాది జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేరం రుజువు కావటంతో ఆ ముగ్గురికి ఇప్పుడు శిక్షలు ఖరారయ్యాయి.
29 ఏళ్ల ఓ మేనిక్యూరిస్ట్ ఆల్ సహ్దా ప్రాంతంలో టాక్సీ కోసం ఎదురుచూస్తుండగా ఓ మహిళ బృందం ఆమెను కిడ్నాప్ చేసింది. దగ్గర్లోని తమ ఫ్లాట్ కు తీసుకెళ్లి, ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా ఫోటోలు, వీడియో తీశారు. వాటిని వాట్సాప్ ద్వారా ఇటలీలో ఉంటున్న ఆమె సోదరుడికి పంపారు. భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేశారు. లేకపోతే ఆ వీడియోను నెట్ లో పెడతామని బెదిరించారు. అయితే తనకు రెండు రోజుల సమయం కావాలని అతను కోరగా, దానికి వారు ఒప్పుకున్నారు. ఈ గ్యాప్ లో దుబాయ్ లోని తన స్నేహితులకు విషయం చెప్పగా, వారు పోలీసుల సాయంతో నిందితుల కోసం వెతకసాగారు. అయితే వాట్సాప్ లో పంపిన ఫోటోల ఆధారంగా నిందితుల ఫ్లాట్ ను పోలీసులు తేలికగానే కనుగొన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ ముగ్గురు మహిళలు, వారికి సహకరించిన ఓ ఈజిప్ట్ వ్యాపారవేత్తను శిక్ష పూర్తయి బయటికి రాగానే గల్ఫ్ చట్టాల ప్రకారం దేశ బహిష్కరణ చేస్తారంట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more