Allu Arjun Gets Stuck In Temple Lift

Allu arjun faces pokiri trouble

Allu Arjun, Boyapati Srinu, Boyapati Seenu, Simhachalam, Andhra Pradesh, Hyderabad, cinema, Telugu cinema, tollywood news, sarainodu, satyanarayana

Following the success of Sarrainodu, Allu Arjun and the film’s director Boyapati Srinu offered prayers to Lord Varaha Narasimha Swamy at Simhachalam, When they were on their way down from the hilltop, the lift got stuck midway.

అల్లు అర్జున్ కు ‘పోకిరి’ కష్టాలు..

Posted: 05/28/2016 07:34 AM IST
Allu arjun faces pokiri trouble

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఆయనను ఇబ్బందులకు గురి చేశారు. సరైనోడు చిత్రానికి అంచనాలకు మించిన పాజిటివ్ టాక్ తో మంచి సక్సెస్ రేంజ్ లోకి దూసుకెళ్లి 100 కోట్ల క్లబ్ కు చేరువలో పయనిస్తున్న తరునంలో ఆయనకు అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సహా యూనిట్ తో కలసివెళ్లిన ఆయనకు కాసేపు పోకిరిలో మహేష్ బాబు కష్టాలను ఎదుర్కోన్నారు. అదేంటి అంటారా..? అదేనండీ అల్లు అర్జున్ సహా దర్శకుడు బోయపాటిలు కాసేపు లిఫ్టులో చిక్కుకుపోయారు.

సరైనోడు సినిమా విజయవంతం కావడంతో సింహాచలం వచ్చిన అల్లు అర్జున్, బోయపాటి శ్రీను స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, భక్తులు అల్లు అర్జున్‌ని చుట్టుముట్టారు. వారిని పలకరిస్తూ దర్శనానంతరం ఆలయంలోంచి బయటకి వచ్చేటప్పుడు రాజగోపురం వద్ద ఉన్న లిఫ్టులో అల్లు అర్జున్, బోయపాటి పది నిమిషాలపాటు చిక్కుకుపోయారు. వారితోపాటు పరిమితికి మించి జనం ఎక్కడంతో లిఫ్టు ఆగిపోయి, తలుపులు తెరచుకోక కలకలం రేగింది. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్టు తలుపులు వంచి అల్లు అర్జున్‌ని పంపించారు. లిఫ్టు మరమ్మతులకు అయ్యే ఖర్చుని తాము భరిస్తామని వారి వెంట వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్ సత్యనారాయణ దేవస్థానం అధికారులకు తెలియజేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles