tollywood actor and director faces same trouble after actress

After apoorva posani also faces threats

naresh, posani krishna murali, posani police complaint, threat calls for posani, celebrities, movies, music, headlines, gossips, news, Hyderabad, cinema, Telugu cinema, tollywood news, sarainodu, satyanarayana

Senior character artist and filmmaker Posani Krishna Murali was at SR Nagar Police Station. The actor has come to meet the police officials to lodge a complaint on a person named Naresh.

నటి తరువాత నట,దర్శకుడికి సేమ్ ట్రబుల్..

Posted: 05/28/2016 08:11 AM IST
After apoorva posani also faces threats

టాలీవుడ్ సీనియర్ నటి అపూర్వ తరువాత సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. నటి అపూర్వ ఇంటికి వెళ్లిన గుర్తు తెలియని అగంతకులు అమెను బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఘటన తెలిసిందే. అదే తరహాలో ఓ వ్యక్తి నట, దర్శకుడు పోసానికి కూడా ఫోన్ చేసి తనకు డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో అంతుచూస్తానంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేయడంతో పాటు అసభ్యకర మెసేజ్ లు కూడా పంపాడు. దీంతో గుర్తు తెలియని అగంతకుడి నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్, మేసేజ్ ల సమాచారాన్ని ఆయన ఎస్ ఆర్ నగర్ పోలీసులకు అందించాడు.

కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. సినీ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసిన లక్ష్మీనారాయణ అలియాస్ నరేష్ ఫోన్ నెంబరుగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్ తనకు డబ్బులు కావాలని పోసానిని ఫోన్‌లో అడిగాడు. మీరెవరో తనకు తెలియదనీ, ఫోన్‌చేసి డబ్బులు అడగటం ఏమిటని పోసాని అతడిని ప్రశ్నించాడు. తాను కూడా సినీ పరిశ్రమలో పని చేస్తున్నానని, అత్యవసరంగా డబ్బులు కావాలని నరేష్ చెప్పగా తరువాత మాట్లాడతానని పోసాని ఫోన్ పెట్టేశాడు. వినిపించుకోని నరేష్ పోసానికి ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. నీ అంతు చూస్తానని పోసాని ఫోన్‌కు మెసేజ్‌లు పంపాడు. నరేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naresh  posani krishna murali  police complaint  threat calls  

Other Articles