python attacked man in his private parts in Thailand

Python bites man s penis while he was in toilet

Attaporn Boonmakchuay, Thai man, toilet, python attack on mans penis, python attack on man, python attack toilet, python momentarily lost its strength, python snake, anaconda, private part, toilet, Chachoengsao hospital, Bangkok, Thailand

Thai man Attaporn Boonmakchuay suffered a three-inch (eight cm) wound after being bit on the penis by the python which had crawled up through the plumbing, is recovering in hospital.

ITEMVIDEOS: కరవరాని చోట కరిచిన అనకొండ..!

Posted: 05/28/2016 10:27 AM IST
Python bites man s penis while he was in toilet

థాయ్లాండ్లో ఒక సాధారణ వ్యక్తి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఎంతలా అంటే అతడున్నది అస్పత్రి బెడ్ మీదైనా.. అక్కడికి కూడా వచ్చి మీడియా అతన్ని ఇంటర్వ్యూలు చేస్తుంది. ఇదే టాపర్ గా నిలిచిన విద్యార్థి మాదిరిగా అతన్నెందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేక అతనేమైనా నూతన అవిష్కరణకు కారకుడా.. ఏదైనా కనిపెట్టాడా అన్న సందేహాలు వద్దు. ఎందుకంటే అతనికి ఎదురైంది ఊహించని ఘటన. తన ఇంటిలోని టాయ్లెట్ తన పాపులారిటీకి కారణమైంది. అయితే అదే సమయంలో ఇప్పుడా టాయిలెట్ రూం అనగానే జంకిచస్తున్నాడు. ఎందుకంటారా..? కరువరాని చోట కొండచిలువ కరవడంతో హాస్పిటల్ బెడ్పై పడ్డాడు అతగాడు. ఈ విషయం అలా అలా వ్యాపించి ఇప్పడు ప్రపంచ మొత్తంగా తెలిసిపోయాడితగాడు.

వివరాల్లోకి వెళ్తే.. అత్తాపోర్న్ బూన్మక్చోయ్ అనే వ్యక్తి టాయ్లెట్కు వెళ్లగా టాయ్లెట్ బౌల్ వెనకాల దాక్కున్న ఓ 10 అడుగుల కొండచిలువ దాడిచేసింది. ఈ ఘటనలో అతని ప్రైవేట్ పార్ట్లో కొండచిలువ కరిచి సుమారు అరగంట పాటు అతనికి నరకయాతన మిగిల్చింది. కొండచిలువ అతని మర్మాంగాన్ని తన నోట బంధించడంతో.. నోప్పి భరించలేని అతడు కేకలు పెట్టాడు. దీనిని గమనించి అతని భార్య వచ్చ..  కొండచిలువకు తాడుకట్టి లాగితే గాని బూన్మక్చోయ్ ప్రైవేట్ పార్టును అది వదిలిపెట్టలేదు.

సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం హుటాహుటిన తరలివచ్చి.. బూన్మక్చోయ్ను అసుపత్రికి తరలించారు. సుత్తులలో టాయ్ లెట్ ను పగలగోట్టిన స్థానిక అధికారులు కొండచిలువను స్వాదీనం చేసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కాగా బూన్మక్చోయ్ చాలా అదృష్టవంతుడని, కొండచిలువ కాటు అతని యూనిరనీ ట్రాక్ లోకి వెళ్లలేదని దీంతో అతడు ప్రమాదం లేకుండానే బయటపడ్డాడని ఛాచెంగ్సో అస్పత్రి వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా మీడియా అతడ్ని చుట్టుముట్టగా.. విపత్కర పరిస్థితుల్లో సైతం బెడ్పై నవ్వుతూ థాయ్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నాడు బూన్మక్చోయ్.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles