Gold cracks below Rs 29k, hits over 3-month low on global cues

Gold futures slide to lowest close in 3 months

gold, silver, gold price, silver price, bullion market, new delhi, gold price in india, gold price in mumbai, gold price in hyderabad

Gold prices today crashed Rs 355 to break below the Rs 29,000 mark at Rs 28,870 per 10 grams— an over 3-month low—in line with a weak trend overseas amid sluggish demand from jewellers at the domestic spot market.

కాంతి తగ్గుతున్న పసిడి..

Posted: 05/28/2016 08:18 PM IST
Gold futures slide to lowest close in 3 months

మగువల ఇష్టపడే లోహం బంగారం, అలాంటి పసిడి తన కాంతులీనిపోతుంది. వరసగా రెండో రోజూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. క్రితం రోజు నాటికి మూడు నెలల కనిష్ఠానికి చేరిన పసిడి ధర.. ఇవాళ కూడా స్వల్పంగా తగ్గింది. రూ.20 తగ్గడంతో 99.9శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.28,850కి చేరింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పడడుతుండటం, దేశీయంగా డిమాండు తగ్గడం వల్ల కూడా రేట్లు తగ్గముఖం పడుతున్నాయన్న వార్తలు అందుతున్నాయి, కేంద్రం తీసుకోచ్చిన నూతన నిబంధనల వల్ల పసిడి కాంతులు కనిపించకుండా పోతున్నాయన్న మార్కెట్ విశ్లేషకులు టాక్.

దీనికి తోడు ముహూర్తాలకు బ్రేక్ రావడంతో పలు బంగారం కొనడానికి నగల వ్యాపారులు ముందుకు రాకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.55శాతం తగ్గి 1,212.80 యూఎస్‌ డాలర్లకు చేరింది. అలాగే శనివారం వెండి ధర సైతం తగ్గింది. రూ.70 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.39,000కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో దీని ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 16.20 యూఎస్‌ డాలర్లుగా ఉంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles