Kanpur shocker: Bankrupt man puts wife at stake in IPL bet, loses her

Man loses wife as stake in ipl betting

mahabharata, yudhishthir, drapuadi, govindnagar, ipl betting, kanpur, husband losses wife in ipl betting, man loses wife in ipl gambling, up man losses wife in betting, social activist, ipl betting, share market,

An unimaginable instance of betting has come to light in Kanpur, Uttar Pradesh, where bankruptcy led a man to keep his wife at stake in an IPL bet and later losing her.

ఐపీఎల్ బెట్టింగ్ లో భార్యను పందెం కాసిన కలియుగ అధర్మరాజు

Posted: 05/28/2016 08:51 PM IST
Man loses wife as stake in ipl betting

మహాభారతంలో ధర్మరాజు జూదంలో భార్య ద్రౌపదిని ఓడిపోయాడు. సరిగ్గా అదే తరహాలో ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రబుద్ధుడు.. ఐపీఎల్ బెట్టింగ్లో భార్యను ఓడిపోయాడు. అయితే ఇతను కలియుగ ధర్మరాజు మాత్రం కాదు. అంతటి ధర్మపథంలో నడిచే వ్యక్తి మాత్రం కాదు, ఎందుకంటే రాజుల కాలంలో బెట్టింగ్లు, పందాలు, జూదం సక్రమమేమో కాని, ఇప్పుడున్న  పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వాలు వాటిని నిషేందించాయి. అయినా అక్రమ పందెలలో భార్యను అంగడివస్తువుగా, అట వస్తువుగా జూదంలో పెట్టాడంలే ఆ ఘనుడు అధర్మరాజు కాక మరేంమవుతాడు. భర్త ఓటమితో ఆమెను గెలిచిన జూదరులు తమతో రావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. జూదరుల ఆగడాలు భరించలేక ఆ యువతి సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిందితుడు సంపన్నుడేనని, అయితే షేర్ మార్కెట్లో తన సంపదను, అస్తిని పోగోట్టుకున్న ఆయన అసహనంతో  తన భార్యను వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి 7 లక్షల రూపాయలు తీసుకురావాల్సిందిగా భార్యను సతాయించేవాడు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై అతను పందేలు కాసేవాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం  మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Man  wife  stake  IPL gambling  kanpur  uttarpradesh  

Other Articles