ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అప్పట్లోనే మంచి అవకాశం వచ్చింది. కీలక నేతల మద్ధతు కూడగట్టినప్పటికీ, ఎందుకనో ఆ అంశంలో బాబు అనాసక్తి ప్రదర్శించడంతో పదవి చేజారిపోయింది. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జాతీయ పార్టీ నేత హోదాలో హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఆయన ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తనయుడు నారా లోకేష్‌కు రాష్ట్ర రాజకీయాలను అప్పగించడానికి వ్యూహరచనలో భాగంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ‘మహానాడు’ వేదికగా జాతీయ మీడియాతో శనివార ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం తనకు ఎప్పటి నుంచో ఆసక్తి అని, త్వరలో అవి జరిగే సూచనలు పుష్కలంగా ఉన్నాయంటూ ముందస్తు సూచనలు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన అప్పట్లో జరిగిన ఓ అంశాన్ని ప్రస్తావించారు. 1990లో తనకు అందివచ్చిన ప్రధానమంత్రి పదవిని తన కొడుకు నారా లోకేశ్ వద్దనడంతో వదిలేశానని ఆయన చెప్పారు. ‘‘యునైటెడ్ ఫ్రంట్ కు అధికారం దక్కడంలో 1996లో మేం కీలక పాత్ర పోషించాం. ఈ క్రమంలో ప్రధాని పదవి చేపట్టాలంటూ పలువురు ప్రముఖ నేతలు నన్ను ఆహ్వానించారు. అందుకు నేను విముఖత చూపా. అయితే జ్యోతిబసు తదితరులు మరోమారు నాకు పీఎం పోస్టును ఆఫర్ చేశారు. అప్పుడు లోకేష్ తొమ్మిదో లేక పదో తరగతి చదువుతున్నాడు. ఆ వయసులోనే ప్రధాని పదవి చేపట్టవద్దంటూ నన్ను ఆపాడు. ప్రధాని పదవి తాత్కాలికమేనని నన్ను హెచ్చరించాడు. దీంతో చేతికి అందిన ప్రధాని పదవిని వదిలేశా’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయాలను ఓ జాతీయ వార్తా సంస్థ ప్రముఖంగా ప్రచురించగా, వెలుగులోకి వచ్చింది. అప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని వదలుకోవడానికి, ఇప్పుడు బ్యాక్ నేషనల్ పొలిటిక్స్ అనడానికి రెండిటీ వెనకాల లోకేషే ఉన్నాడన్నమాట.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more