తెలంగాణ ప్రభుత్వం తీరును నిరసిస్తూ గత అర్థరాత్రి నుంచి పెట్రోలియం, ఎల్పీజీ ట్యాంకర్ల సమ్మె బాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై 14.5 వ్యాట్‌ను విధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పెట్రోలియం ట్యాంక్ ట్రక్స్ ఓనర్స్ ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. ఆదివారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌తో సుమారు మూడు గంటలపాటు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి మూకుమ్మడిగా ట్యాంకర్లను నిలిపివేశారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా గల ప్రధాన ఆయిల్ కంపెనీల ఏడు టెర్మినల్స్‌లో సుమారు మూడు వేల ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఫలితంగా 1,564 బంకులకు పెట్రోల్ సరఫరా ఆగిపోయింది. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్(టీపీడీఏ) మద్దతు ప్రకటించినప్పటికీ జూన్ 5 తర్వాత తమ ట్యాంకర్లను రోడ్డుపై తీయకుండా పెట్రోలియం రవాణాను స్తంభింపచేస్తామని వెల్లడించింది. పెట్రోలియం, ఎల్పీజీ రవాణాపై వ్యాట్‌ను ఉపసంహరించే వరకు సమ్మె నిలిపివేసే ప్రసక్తే లేదని ప్రకటించింది.
ఈ సందర్భంగా ట్రక్స్ ఓనర్స్ అసొసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు కె.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఆరీఫ్-ఉల్-హుస్సేన్ లు మాట్లాడుతూ.. ఎల్పీజీ రవాణాపై కూడా వ్యాట్ విధిస్తే.. తాము ఎలా మనగలమని వారు ప్రశ్నించారు. ప్రభుత్వానికి అన్ని తెలిసి కూడా తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాని పక్షంలో రానున్న రోజుల్లో తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, సమ్మె ప్రభావం రెండురోజుల వరకు ఉండదని, ఆ మేరకు స్టాక్ ఉందని పెట్రోలియం డీలర్ల సంఘం ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.
కాగా మరో మూడు రోజుల్లో అత్యంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకలపై కూడా పెట్రోలియం ట్రక్కు ఓనర్ల సమ్మె ప్రభావం పడనుంది. బుధవారం వరకు ట్యాంకు ఓనర్ల ప్రభావం అంతంత మాత్రంగా వున్నా.. ఆ తరువాత మాత్రం సరిగ్గా తెలంగాణ అవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ రెండున మాత్రం ఇబ్బందులు ఎదురుకాక తప్పదని, దీంతో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం వేడుకల అట్టహాసానికి ఇబ్బందులు వాటిల్లే ప్రమాదముందని వార్తలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more