8-Year-Old Girl Pretended To Be Dead To Escape Her Rapist In Delhi

8 year old delhi girl pretended to be dead to escape rapist

Girl Pretended to Be Dead to Escape Rapist, Delhi, rape, minor, Crime Against Women (CAW), CCTV Footage, Minor Raped, Delhi Rape, Rape on minors, sexuall harrasment on miors, outer delhi rape,

An eight-year-old girl, who was allegedly abducted and raped by a youth in Delhi's Kirari, pretended to be dead to escape from the clutches of her rapist,

ITEMVIDEOS: రేపిస్టు నుంచి 8ఏళ్ల చిన్నారి తప్పించుకుందిలా..

Posted: 06/01/2016 08:56 AM IST
8 year old delhi girl pretended to be dead to escape rapist

దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రెండ్రోజుల్లో ఢిల్లీ,యూపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో పైశాచిక మృగాళ్లు.. అభంశుభం తెలియని అమాయక బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఢిల్లీలో వేసవి తాపాన్ని తాళలేక ఇంటి ఎదుట ఆరుబయట తల్లిదండ్రులతో కలసి గుడిసె బయట పడుకున్న ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేశారు. ఆ తరువాత రేపిస్టు నుంచి తప్పించుకోడానికి అ బాలిక చనిపోయినట్లు నటించింది. దీంతో రేపిస్టు దృష్టి మరల్చి ఆ బాధితురాలు తప్పించుకుంది.

ఢిల్లీలోని కిరారి అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైంది. వేసవి తాపం తాళలేక తల్లిదండ్రులతో కలసి ఆరుబయట పడుకున్న బాలికను కామాంధుడు కిడ్నాప్ చేసి నిర్ఝన ప్రాంతానికి సుకెళ్లాడు. ఆమెకు తర్వాత మెలకువ వచ్చి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ఎక్కడో.. ఎవరి పక్కనో ఉన్నట్లు గమనించి గట్టిగా అరిచేందుకు ప్రయత్నించింది. కానీ, అతడు ఆమె నోరు మూసేశాడు. తర్వాత అతడు తనను చంపేస్తాడేమోనన్న భయంతో ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది.

దాంతో నిందితుడు బాగా భయపడ్డాడు. ఆమెను గిల్లి చూశాడు. అయినా ఆమె కదల్లేదు. అతడు దూరంగా వెళ్లగానే ఆమె లేచి ఇంటివైపు పరుగు తీసింది. అది చూసి అతడు కూడా ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు గానీ, రాయి తగిలి కింద పడిపోయాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఓ మైనర్ బాలుడని నిర్ధారించుకున్న పోలీసులు.. సిసిటీవీ ఫూటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నారి దుస్తుల మీద రక్తపు మరకలు చూసి తల్లిదండ్రులు హడలిపోయారు. తనకు పొత్తికడుపులో నొప్పిగా ఉందని చెప్పి, తర్వాత ఏడుస్తూ జరిగిన ఘోరం వివరించింది. ఆ చిన్నారి ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Minor Raped  Delhi Rape  abuducted  kirari  Delhi  

Other Articles