JetBlue Stops Passenger From Boarding Plane Because of Her Short Shorts

Jetblue passenger stopped from boarding plane over clothing

Maggie McMuffin, JetBlue airlines, passenger stopped, burlesque clothing, love and war, jetblue, burlesque, short shorts, everyday sexism, boston, shorts, seattle, logan airport

Following airline companies’ grand traditions of making flying more difficult for passengers who speak Arabic, do math, or breast-feed, one woman says she was stopped from boarding a JetBlue plane because her shorts were too short.

పొట్టి షార్టులేసుకుని.. విమానం ఎక్కబోతే..

Posted: 06/01/2016 08:12 AM IST
Jetblue passenger stopped from boarding plane over clothing

ఆలయాల్లో అచారాలు పాటించడానికే విముఖత వ్యక్తం చేసే నేటి రోజుల్లో ఇక విమానంలో ప్రయాణిచాలంటే ఇలా వుండాలన్న నిబంధలను ఎవరు మాత్రం పాటిస్తారు. ఇక విమానం పిబ్బంది కూడా ఈ మధ్య అంక్షలను కఠినతరం చేశారు. అరబిక్ బాషలో మాట్లాడినా.. లేక విమానంలో కూర్చోని గణితం చేసినా.. లేక బిడ్డలకు పాలిచ్చినా.. అవి కుదరవంటూ తప్పబడుతూ ఏకంగా విమానంలోనికే అనుమతించడంలేదు. ఒకవేళ ఎక్కినా వారిని విమానం నుంచి దింపేస్తున్నారు. ఈ అంక్షలపై ప్రయాణికులు మండిపడుతున్నా.. విమర్శలు వెల్లివిరుస్తున్నా వారు మాత్ర పట్టించుకున్న పాపాన పోవడంలేదు.

ఇక తాజాగా పోట్టి షార్టులతో విమానం ఎక్కడానికి వచ్చిన ప్రయాణికురాలికి ఎయిర్ లైన్స్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె దుస్తులు సరిగా లేవన్న కారణంగా విమానంలో కాలు పెట్టేందుకు అభ్యంతరం చెప్పారు. మసాచుసెట్స్ లోని లోగాన్ ఎయిర్ పోర్టులో కొన్ని రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాగీ మెక్ మఫ్ఫీన్ లోగాన్ లో జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించి బోస్టన్ చేరుకుని, అక్కడ కనెక్టింగ్ ఫ్లయిట్ అందుకుని న్యూయార్క్ కు వెళ్లాల్సి ఉంది.

ఆమె ఓ స్వెట్టర్, చిన్న షార్ట్ వేసుకుందని, పొడవాటి సాక్సు ధరించి ఉందని జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. సీటెల్ కు చెందిన మాగీ మరీ పొట్టి దుస్తులు వేసుకుని వచ్చిందని, ఆమెను దుస్తులు మార్చుకోవాల్సిందిగా సూచించారు. లేనిపక్షంలో విమానం ఎక్కేందుకు ఆమెను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక మాగీ.. వేరే టర్మినల్ కు వెళ్లి 22 డాలర్లు ఖర్చుపెట్టి కొత్త షార్ట్స్ కొనుక్కుంది. ఆ తర్వాత హాయిగా ప్రయాణించి బోస్టన్ చేరుకుంది.

రూల్స్ లో ఈ విషయాలు లేకున్నా తనను అడ్డుకున్నారని మాగీ చెప్పింది. విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు లేని రూల్స్ ప్రయాణించేప్పుడు మాత్రం విమాన సిబ్బందికి గుర్తుకు రావడం పట్ల అమె అభ్యంతరం తెలిపారు. ఎగతాళి చేసేలా లోగోలు, ఫొటోలు ఉన్న దుస్తులు ధరిస్తే ఎయిర్ లైన్స్ నియమాలకు విరుద్ధమని అధికారులు వెల్లడించారు. తనను విమానం ఎక్కకుండా గేట్ వద్దే నిలిపివేసినందుకు సిబ్బంది క్షమాపణలు చెప్పిందని బాధిత ప్రయాణికురాలు స్థానిక మీడియాకు వెల్లడించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maggie McMuffin  JetBlue airlines  passenger stopped  burlesque clothing  

Other Articles