పసికందుతో తిక్కబాబా పిచ్చి చేష్టలు | baba mad acts with new born baby

Baba mad acts with new born baby

baba, infant, baba shaking baby, తాజా వార్తలు, ఐటెం వార్తలు, జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, latest news, telugu news

self style godman playing with new born baby video viral in youtube.

ITEMVIDEOS: పసికందుతో తిక్కబాబా పిచ్చి చేష్టలు

Posted: 06/03/2016 03:32 PM IST
Baba mad acts with new born baby

మీరెంతన్న చెప్పండి బాబాలను, స్వాములను ఇంకా నమ్ముతాం అనేవారికి కనీసం ఈ వీడియోతోనైనా కనువిప్పు కలుగుతుందేమో. ఆరోగ్య సమస్యలు దూరం చేస్తానంటూ ఉత్తర భారతదేశంలోని ఓ ప్రాంతంలో వెలిశాడో బాబా. చీరతో, పసుపు కుంకుమతో సింగారించుకుని తన వద్దకు వచ్చే భక్తులకు అభయహస్తం ఇస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ పసికందును తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఇక మీరు నిశ్చితంగా ఉండండి అంటూ తనదైన వైద్యానికి సిద్ధమయిపోయాడు. ఒళ్లు గగ్గురుపోడిచే అతగాడి విన్యాసాలు మీరూ చూడండి...

బిడ్డను బాహుబలిలో శివగామిలా ఒక చేత్తో ఎత్తుకున్నాడు. ఆపై అటు ఇటు, ముందుకు వెనక్కి, పైకి కిందకి గిరగిరా తిప్పేశాడు. గాల్లో ఆ బిడ్డను అలా తిప్పడం చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది పోవటం ఖాయం. కానీ, అక్కడున్న భక్తులు మాత్రం సదరు తిక్క బాబాగారి మాయలో మునిగిపోయారు. పరవశంతో చప్పట్లు కొడుతూ ఊగిపోసాగారు, వారికి ఆ బిడ్డ తల్లిదండ్రులు జతకలిశారు కూడా. అలా రెండు నిమిషాల తర్వాత చివరికి ట్రీట్ మెంట్ ను ఆపేసి ముద్దాడాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది.

భాస్కర్
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baba  new born baby  treatment  

Other Articles