చంద్రబాబు అసిడిటీకి కారణం తెలుసా? | nayini narasimhareddy satires on chandrababu

Nayini narasimhareddy satires on chandrababu

telangana development, home minister Nayini, chandrababu naidu, nayini satires on babu, చంద్రబాబు, నాయిని నర్సింహారెడ్డి, బాబుపై నాయిని పంచ్, తెలంగాణ వార్తలు, రాజకీయాలు, తాజా వార్తలు, AP news, telanagana news, latest news, telugu news

telangana home minister nayini narasimha reddy strong reply to chandrababu. satires that babu jilted with telangana development.

చంద్రబాబు అసిడిటీకి కారణం తెలుసా?

Posted: 06/03/2016 02:58 PM IST
Nayini narasimhareddy satires on chandrababu

విభజన సమయంలో మోసం చేశారంటూ, తమ సమస్యలను వినిపించుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై నవనిర్మాణదీక్షలో చంద్రబాబు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై అంటే టీఆర్ఎస్ పై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎంతో కష్టపడి తాను ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలబెడితే మమల్ని కట్టుబట్టలతో వెల్లగడతారా అంటూ ఆక్రోశించారు. అభివృద్ధితో భాగ్యనగరం ఆదాయాన్ని గణనీయంగా పెంచితే, నెత్తిన అప్పులతో వెల్లగొట్టారని, ప్రాజెక్టులతో ఏపీని ఎడారిగా మార్చాలని చూస్తున్నారని, వాళ్లంతా కుళ్లుకునేలా మన అభివృద్ధి ఉండాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చాడు. అయితే అప్పుడెప్పుడో జరిగిన సంగతులను గుర్తు చేసుకునే బదులు ఇప్పుడున్న ప్రభుత్వం పైగా మిత్రపక్షం అయిన బీజేపీని గట్టిగా నిలదీస్తే పనులు జరుగుతాయి కదా అంటూ తోటి నేతలే ఆయనపై సెటైర్లు వేసే స్థితికి చేరారు. మరోవైపు అవతరణ ఉత్సవాల వేడుకల్లో బిజీగా ఉన్న టీ నేతలు ఇవేం పట్టించుకోలేదనుకుంటే పొరపాటే.
 
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణాను చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంటున్నారు. బాబు చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడి డెవలప్ మెంట్ కంటగింపుగా మారే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని, సాగు, తాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేసిందే నీళ్లు, నిధుల కోసమని గుర్తు చేశారు. నీటి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని నాయిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనకు కడుపుమంట మంచిది కాదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలోని ఆంధ్రా ప్రజలంతా తెలంగాణ వాసులేనని చెప్పిన ఆయన, ఇక్కడి వారి పొట్టగొట్టేందుకు చూస్తున్న వారంతా శత్రువులతో సమానమని ఆయన స్టైల్లో నిప్పులు చెరిగారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana development  t home minister  nayini narasimha reddy  chandrababu naidu  

Other Articles