Mother, Facebook lover arrested for killing teen daughter, disguising it as suicide

Mother murders daughter over a shared lover

Mother, Facebook lover arrested for killing teen daughter, disguising it as suicide, mother murders daughter, shared lover, Abohar town murder, love on facebook

A 17-year-old girl believed to have committed suicide was actually murdered by her mother over a shared love interest.

ప్రేమ కోసం ప్రియుడితో కలసి..

Posted: 06/03/2016 04:56 PM IST
Mother murders daughter over a shared lover

మానవీయ విలువలు రానురాను దిగజారిపోతున్నాయి.. ఆడపిల్లకు తండ్రి, సోదరుల నుంచి కూడా రక్షణ లేదని, కేవలం తల్లి లేదా మరో అడదే అమె రక్షణకు నిలబడుతుందని భావిస్తున్న తరుణంలో అది కూడా వాస్తవం కాదు.. ఎవరికి వారే యుమునా తీరే అన్న విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తే తన భార్యను వ్యభిచారం రోంపిలోకి దింపాలని ప్రయత్నించిన ఘటన ఇటు తెలంగాణలో వెలుగుచూడటం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

కాగా అదే తరహాలో మరో ఘటన పంజాబ్ లో వెలుగుచూడటంతో ఇక ఆడపడచుల భద్రత అగమ్యగోచరంగా మారుతోంది. పంజాబ్ లో ఓ తల్లి తన ఫేస్ బుక్ ప్రేమ కోసం ఏకంగా కూతుర్నే బలితీసుకుంది. అయితే అమె మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. కొన్ని రోజుల కిందట పంజాబ్ లోని అబోహర్ పట్టణంలో దీక్ష(17) చనిపోయింది. ఆత్మహత్యగా నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు దీక్ష మరణం వెనుక అసలు రహస్యాలను తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఫేస్ బుక్ లవర్ విజయ్ కుమార్ అలియాస్ సోను కోసం కూతుర్ని అంతం చేసిందని చెప్పారు.

కూతురు దీక్షతో కలిసి నివసిస్తున్న తల్లి మంజుకు.. సౌదీ అరేబియాలో వున్న విజయ్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.  2015 అక్టోబర్ లో ఫేస్బుక్ ద్వారా ఇరువురు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ఏడాది డిసెంబర్ లో విజయ్ ఇండియాకు తిరిగొచ్చాడు. ఈ జనవరి నుంచి అబోహర్ లో ఉన్న మంజు ఇంట్లోనే విజయ్ మకాం వేశాడు. తల్లితో సహజీవనం చేస్తున్న విజయ్ మెల్లమెల్లగా దీక్షపై కన్నేశాడు. దీక్షతో విజయ్ చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. కూతురు కూడా విజయ్ ను ప్రేమించింది.

అయితే తల్లితో కూడా అతడు సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని ఓ రోజు రాత్రి గుర్తించింది. కూతురు ఈ విషయంలో తల్లిని నిలదీసింది. దీంతో తాను విజయ్ ని ప్రేమిస్తున్నట్లు మంజు కూతురికి చెప్పేసింది. తాను కూడా విజయ్ తో గాఢమైన ప్రేమలో ఉన్నట్లు తల్లికి తెగేసి చెప్పింది. ఇక అంతే ప్రియుడు తనకే దక్కాలి, తననే పెళ్లి చేసుకుంటాడంటూ తల్లీకూతుళ్ల మధ్య పోటీ మొదలైంది. తన లవర్ ను కూతురు ఎగరేసుకు పోతుందని భావించిన తల్లి అమెను చంపేందుకు  పథకం పన్నింది.

ఫ్యాన్ కు ఉరివేసి గత నెల 24న దీక్షను తన లవర్ సాయంతో చంపేసింది. కుటుంబ తగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా దీక్ష పేరుతో విజయ్ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. బంధువులు తమ ఆస్తి ఇవ్వలేదని సూసైడ్ చేసుకుందని పోలీసులను నమ్మించాలని చూసింది. అయితే దీక్ష చేతిపై విజయ్ పేరు పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మంజు, విజయ్ లను తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం చెప్పేశారు. దీంతో హవ్వ 17 ఏళ్ల కూతుర్ని పెట్టుకుని తల్లి రోమాన్స్ చేస్తుందా..? అంటూ స్థానికులు నివ్వెరపోయారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother  Daughter  Facebook  shared Lover  murder  punjab  

Other Articles