ప్రేమించిందన్న ఒకే కారణంతో రెండో పెళ్లివాడని కూడా చూడకుండా పిల్లనిచ్చినందుకు ఆ తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. పదేళ్లుగా ఆమెపై జరుగుతున్న అఘాయిత్యాన్ని వారు ఆలస్యంగా పసిగట్టారు. కేవలం లైంగిక వాంఛ కోసమే వాడుకున్నాడని తెలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేరాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు అతగాడి దుర్భుధ్దికి సరైన శిక్ష విధించింది. యావజ్జీవ శిక్షతో పాటు అతని ఆస్తులను అమ్మి మరీ ఆ అమ్మాయికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
బీదర్ జిల్లా ఔరద్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్కు ఎస్డీఎమ్సీ చైర్మన్గా మారుతి ఆమ్రెప్ప (34) అనే వ్యక్తి విధులు నిర్వహించేవాడు. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలికపై ప్రేమగాలం వేశాడు. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా, ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ పెళ్లి చేసుకుంటానని బాలిక కుటుంబ సభ్యులకు బంపరాఫర్ ఇచ్చాడు, ససేమిరా అన్న ఆమె తల్లిదండ్రులు బాలికను మంగళూరుకి తరలించి అక్కడ చదివించసాగారు. అయినా మారుతి వదల్లేదు. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మరీ ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. బాలిక కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తుండటంతో తల్లిదండ్రులు అడ్డుచెప్పలేకపోయారు.
ఇక అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. గర్భవతైన ప్రతిసారీ ఆమెకు అబార్షన్ చేయించడం ప్రారంభించాడు మారుతి. ఇలా తొమ్మిదిసార్లు చేయించగా, పదోసారి మాత్రం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ఆ బిడ్డను అనాథశరణాలయంలో పడేసి వచ్చాడు ఆ కర్కోటకుడు. ఆ తర్వాత మరోసారి కూడా ఆమె గర్భవతికాగా, ఈసారి అబార్షన్ కు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లోంచి గెంటేశాడు. తల్లిదండ్రుల వద్దకు చేరి అసలు విషయం వారికి చెప్పగా, కూతురికి జరిగిన అన్యాయం విన్న వారు అతనిపై కేసు దాఖలు చేశారు. మాయ మాటలు చెప్పి, ప్రేమ పేరుతో మైనర్ పై పదేళ్లపాటు లైంగికదాడి పాల్పడ్డాడంటూ శిక్ష విధించింది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more