Maharashtra Revenue Minister Eknath Khadse resigns over land scam allegations, link with Dawood Ibrahim

Maharashtra revenue minister eknath khadse resigns

BJP, Fadnavis, Khadse, EKnath Khadse qut, dawood Ibramhim, underworld don, Khadse news, Amit Shah, Modi, India, Maharashtra, Khadse land grabbing, Shiv Sena, Anna Hazare

Maharashtra Revenue Minister Eknath Khadse, who has been under the attack for alleged dubious land deal and suspected underworld links, tendered his resignation to CM Devendra Fadnavis.

మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ బీజేపి నేత..

Posted: 06/04/2016 12:49 PM IST
Maharashtra revenue minister eknath khadse resigns

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా ఇరుకున పెడుతున్న రెండు అంశాలకు సంబంధించిన బీజేపీ అధిష్టాన్యం చర్యలు తీసుకుంది. బీజేపి అధిష్టానం సూచన మేరకు మహారాష్ట్రలోనే అత్యంత సీనియర్ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం ముంబై నగరంలోని వర్ష ప్రాంతాలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నివాసానికి వెళ్లిన ఆయన.. అక్కడ సుమారుగా అరగంటకు పైగా ఫడ్నవిస్ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ఓ లేఖను అందించారు.

మహారాష్ట్ర మంత్రి హోదాలో అక్రమ భూకేటాయింపులకు పాల్పడటంతో పాటు భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో వున్న అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు వున్నాయన్న అరోపణల నేపథ్యంలో అధిష్టానం సూచనల మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ భూ కేటాయింపులలో ఏక్ నాథ్ ఖాడ్సే ప్రమేయం వుందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆయనపై సీరియస్ అయ్యింది.

ఈ వ్యవహారంపై స్వయంగా బీజేపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా..  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో మాట్లాడి, ఈ ఆరోపణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ తరణంలోనే ఆయనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఫోన్ రికార్డులలో కూడా ఖడ్సే నెంబరు చాలాసార్లు ఉందని ఒక హ్యాకర్ ఆరోపించడం సైతం ఆయన పదవికి ఎసరు తెచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కూడా రెవెన్యూ మంత్రి అయిన ఏక్‌నాథ్ ఖడ్సే డుమ్మాకొట్టారు.

తన పదవికి ఎసరు వచ్చిందన్న సంగతి తెలియడంతో ఆయన గత సోమవారం నుంచి తన ఎర్రబుగ్గ కారును కూడా వాడటం మానేశారు. గత ఏప్రిల్ నెలలో ఖడ్సే భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 23 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3 కోట్లకే ఇచ్చేశారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు. ఈ ఆరోపణలపై అటు మిత్రపక్షం శివసేన కూడా మండిపడింది. కాగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహరంలో నిష్ఫక్షపాత దర్యాప్తు కావాలని అదేశించింది. ఇక సామాజిక కార్యకర్త అన్నాహజరే కూడా ఏక్ నాథ్ వ్యవహారంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eknath khadse  maharashtra revenue minister  khadse resigns  devendra fadnavis  

Other Articles