చంద్రబాబుకి కొత్త తలనొప్పి | amaravathi dead line day devides Secretariat employees into two

Amaravathi dead line day devides secretariat employees into two

amaravathi, Secretariat employees, amaravathi dead line, june 27, రాజధాని తరలింపు, అమరావతి, జూన్ 27, తెలుగు వార్తలు, తాజా వార్తలు, సచివాలయ ఉద్యోగులు, latest news, telugu news

amaravathi dead line day devides Secretariat employees into two.

చంద్రబాబుకి కొత్త తలనొప్పి

Posted: 06/04/2016 03:05 PM IST
Amaravathi dead line day devides secretariat employees into two

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నుంచి ఎలాగైనా సరే పాలన కొనసాగించాలన్న డెడ్ లైన్ కు టైం దగ్గర పడుతోంది. ఈ నెల 27 నుంచి ముఖ్య విభాగాలు తమ పనులను ఇక్కడి నుంచే ప్రారంభించాలన్న ఏపీ సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఉన్నతాధికారులకు తాఖీదులు అందాయి. తొలుత వెళ్లేందుకు అస్సలు ఆసక్తి చూపని ఉద్యోగులు చివరకు పాలనపై ప్రభావం పడకుండా దశలవారీగా తరలేందుకు సిద్ధపడ్డారు. అయితే కండిషన్లు కుదరవని, ఎట్టి పరిస్థితుల్లో అంతా తరలిరావాల్సిందేనన్న ఆదేశాలు ఇప్పుడు ఉద్యోగుల మధ్య చిచ్చును పెడుతున్నాయి. సచివాలయ ఉద్యోగులు రెండుగా విడిపోయి ఈ విషయంలో రోడ్డెక్కారు.  

నిర్దేశించిన గడువులోగా వెళ్తామని కొందరు చెబుతుంటే... మౌళిక వసతులు కల్పించేదాకా కదిలేది లేదని మరి కొందరు అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఒక్కతాటిపై ఉన్న సచివాలయ ఉద్యోగులు వేర్వేరు గ్రూప్ లుగా విడిపోయారు. ఓ వర్గం వారు సీఎస్ టక్కర్ ను కలిసి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని ఇప్పటికే కోరారు. ఒకవేళ ఎట్టిపరిస్థితుల్లో తరలించాల్సి వస్తే మాత్రం రెండు విడతలుగా తరలించాలని సీఎస్‌కు ‌విజ్ఞప్తి చేశారు. సోమవారంలోగా రోడ్‌మ్యాప్ ఇవ్వాలని ఆయన్ను కోరారు. అయితే జూన్ 27లోగా కేవలం హెచ్‌వోడీలు మాత్రమే తరలి వెళ్తాయని, సచివాలయ భవనాలు పూర్తయిన తర్వాతే మిగతావారిని తరలిస్తామని సీఎస్ టక్కర్‌ చెబుతున్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ సమస్యలపై ఓ హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఐదు రోజుల పని విధానం, అదనపు హెచ్ ఆర్ఏ తదితర తాయిలాను ప్రకటించిన ప్రభుత్వం మాత్రం ఉద్యోగులంతా ఆ తేదీలోగా తరలిరావాల్సిందేనని చెబుతోంది. ఇందుకు అంగీకరించిన మరో వర్గం సామాన్లు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమైంది. దీంతో గ్రూప్ర్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. దీనిపై రానున్న రోజుల్లో మరింత రచ్చ జరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. తన ఏకపక్ష నిర్ణయంతో చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amaravathi  Secretariat employees  amaravathi dead line  

Other Articles