joint action commitee fires on state government

Joint action commitee slams state government

jac chairman kodanda ram, trs government, professor haragopal, electrical jac leader raghu, golden telangana, KCR

the major support and back bone of TRS in telangana seperate state agitation has once again raised voice against kcr government.

సర్కారుపై నిప్పులు.. చేతకాకుంటే తప్పకోండని హెచ్చరికలు..

Posted: 06/06/2016 11:14 AM IST
Joint action commitee slams state government

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, అన్ని రాజకీయ పక్షాలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడగట్టుకుని ఉద్యమాన్ని ఉదృతంగా ముందుకు తీసుకువెళ్లి.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను సఫలీకృతం చేసిన తెలంగాణ ఐక్యకారచరణ కమిటీ ఇప్పుడదే తెలంగాణ సర్కారుపై నిప్పులు కురిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ అంటూ ప్రగల్భాలు పలుకుతుందే తప్ప వాస్తవంలో తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు లేవని సమరశంఖం పూరించింది.

తెలంగాణ అభివృద్ధి చేయడం పాలకులకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. మేం చేసి చూపిస్తాం. రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నం ఒక్కటీ జరగలేదు. వ్యవసాయం, కుల వృత్తుల విధానాలపై అధ్యయనమే మొదలవలేదు. ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయి? మాకు దురాశ, పేరాశ లేదు. ప్రజలు బాగుండాలనేది మా ఆకాంక్ష. అదే మా అంతిమ లక్ష్యం. ఆ సోయి ఉండబట్టే నిలబడ్డాం. లేకపోతే ఈపాటికి సంస్థను ఎప్పుడో పార్టీలో కలిపేసి వాళ్ల వెనక తిరిగేవాళ్లమ అని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ల కేసీఆర్ సర్కారు పాలన తమకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందన్నారు. రెండేళ్ల తెలంగాణ - ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వ తీరుతెన్నులు అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల బతుకులు బాగుపడలేదని, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ, జిల్లాలను వదిలేశారని కోదండరామ్ విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాంట్రాక్టు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా పనిచేస్తే ప్రయోజనం ఉండదన్నారు. అత్యధిక మంది ఆధారపడే వ్యవసాయ రంగం, సూక్ష్మ పరిశ్రమల అవకాశాలను పెంచి ఆర్థిక స్థోమత కల్పించాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, అందుకే తాము కోర్టులను ఆశ్రయించామన్నారు. పాలీహౌస్ వంటి వాటి వల్ల పేద రైతులకు ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. కుల వృత్తుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగానికి స్పష్టత లేదని, తాటిచెట్టు ఏ డిపార్టుమెంట్ కిందకు వస్తుందో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కేజీ టు పీజీ విద్య ఏమైందని ప్రశ్నించారు. విద్యను ఉచితంగా అందించి, ప్రజల రోగాలకు సరైన చికిత్సలు అందిస్తే తెలంగాణలో మూడోవంతు ఆత్మహత్యలను నివారించవచ్చన్నారు.

రాష్ట్రంలో జరిగే వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అది పనితీరుకు నిదర్శనం కాదని, కేవలం ప్రభుత్వంపై విశ్వాసంతోనే ప్రజలు ఓట్లు వేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలు కాకుండా అంతా తమకే తెలుసునని సీఎం, మంత్రులు భావించడం మంచి పద్ధతి కాదని అన్నారు. అలా భావిస్తే అది వారి అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన ఉస్మానియా యూనివర్సిటీలోనే సభలు పెట్టుకోవద్దని డిక్టేట్ చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులు భవిష్యత్తులో ప్రజలకు గుదిబండగా మారుతాయని విద్యుత్ జేఏసీ నేత రఘు స్పష్టంచేశారు. విద్యుత్ రంగంలోనే 32 సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం ఒక్కదానికి పరిష్కారం చూపలేదని పేర్కొన్నారు. పైగా రెగ్యులేటరీ కమిషన్కు వెళ్లరాదంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అదేశాలను తాము చూడలేదన్నారు. వ్యవసాయానికి 40 శాతం విద్యుత్ తగ్గడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ సమస్య కనిపించడంలేదని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles