బీజేపీ చీఫ్ అమిత్ షాతో మానస్ జ్యోతి డేకా దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ మానస్ జ్యోతి డేకా ఎవరో తెలుసా.. ఓ సాప్ట్ వేర్ ఇంజనీరు. కేవలం రెండు మాసాల క్రితం ఓ విద్యార్ధి నేతపై దాడి చేసి ఓ పెద్ద స్థాయి సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించాడు. ఇంతకీ అ విద్యార్థి సంఘం నేత ఎవరంటారా.. అయన మరెవరో కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దేశద్రోహం కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్.
కాషాయ పార్టీకి వీరాభిమానినని చెప్పుకున్న మానస్ జ్యోతి గతంలో ముంబాయి నుంచి పూణే చేరుకోవాల్సి విమానంలో కన్హయ్య కుమార్ పై దాడి చేసి అయన గొంతు నులిమి హత్యయత్నానికి కూడా ప్రయత్నించాడని అప్పట్లో విద్యార్థి నేత అరోపించారు. ఈ రకమైన దాడులకు కేంద్ర ప్రభుత్వమే తనపైకి ఉసిగోల్పిందని, అయినా తాను బయపడనని అప్పట్లో కన్హయ్య అన్నారు. ఈ ఘటన వెలుగుచూడగానే తమకు మానస్ డేకాకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు కూడా అప్పట్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు.
అయితే క్రితం రోజున మాత్రం ఫూణేలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అపరిచితుడిగా బీజేపి నేతల నుంచి పేరోందిన మానస్ ఏకంగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గోన్న సభలో పాల్గోన్నారు. దివంగత కేంద్ర మంత్రి ప్రమోద్ మహాజన్ దారశనికతపై ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం పుణె వచ్చిన అమిత్ షాను మానస్ జ్యోతి బృందం కలుసుకుంది. అసోమీ యూత్ బృందానికి ప్రాతినిథ్యం వహిస్తూ షాను కలుసుకున్న మానస్.. సెల్పీ కూడా తీసుకున్నారు. అసలు అపరిచితుడు జాతీయ అధ్యక్షుడి వద్దకు ఎలా వెళ్లాడన్న విషయంపై బీజేపి నేతలు నోళ్లెళ్లబెట్టారు.
ఇక సెల్పీ తీసుకున్న మానస్ డేకా తన సోషల్ మీడియా అకౌంట్లలో దానిన పోస్టు చేయగానే నెట్ జనులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కన్హయ్య అభిమానులేకాక చాలామంది నెటిజన్లు విమానంలో దాడివెనుక బీజేపీ హస్తం ఉందని నమ్ముతున్నట్లు కామెంట్లు రాశారు. ఈ ఘటనతో బీజేపి అసలు రంగు బయటపడిందని కూడా కామెంట్లు పోస్టు చేశారు. బీజేపి నేతలు పైకి చెప్పేది ఒకటి, చేసేది మరోకటి కూడి విమర్శలు పెల్లుబిక్కాయి. బీజేపి పాలనలో దేశ ప్రజలు, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేతలు స్వేఛ్ఛను కోల్పోతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా కేంద్రం కాలరాస్తుందని మండిపడుతున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more