కోదండరాం దండయాత్రకి సపోర్ట్ ఉందా? | kodandaram ready to fight against telangana govt

Kodandaram ready to fight against telangana govt

JAC chairman, kodandaram, against telangana govt, against KCR govt, revanth reddy kodandaram, telangana news, political news, రేవంత్ రెడ్డి, కోదండరాం, జేఏసీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం, కోదండరాం దండయాత్ర, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news, political news, politics

JAC chairman kodandaram says ready to fight against telangana govt. and revanth reddy ready to work with kodandaram.

కోదండరాం దండయాత్రకి సపోర్ట్ ఉందా?

Posted: 06/07/2016 09:33 AM IST
Kodandaram ready to fight against telangana govt

అరవై ఏళ్ల తెలంగాణ కల సార్థకం కావటంలో జేఏసీ, దాని చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్రలను ఎవరూ మరవలేరు. పార్టీలన్నింటితో చర్చించి, వాటన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమ పోరాటంలో ముందుండి నడిపించారాయన. ఆపై తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, ఇక తన అవసరం లేదని భావించిన ఆయన ఇన్నాళ్లూ సైలెంట్ అయ్యారు. తాజాగా రెండేళ్ల పాలన పూర్తి సందర్భంగా తెరపైకి వచ్చారు కోదండరాం. విద్యార్థి సంఘాల ఒత్తిడి కావొచ్చు, లేక టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు రాజకీయ శక్తులు కావొచ్చు. కారణం ఏదైనా ఆశించిన మేర కేసీఆర్ ప్రభుత్వం పనిచేయటం లేదని ఆయన పెదవి విరిచేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన టీఆర్ఎస్ నేతలు కోదండరాంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఏజెంట్, కుబుసం విడిచిన పాము ఇలా ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యలు చేసేశారు. దీంతో మళ్లీ మండిపోయిన ఆయన సోమవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక సర్కారుపై దండయాత్రకే సిద్ధమవుతున్నట్లు మరోమారు ప్రకటించారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఊళ్లో ప్రజలు ఆయన కాళ్ల మీద పడి తమ భూములు లాక్కోకుండా ప్రభుత్వం నుంచి రక్షించాలని కోరారు. ‘‘తోడేళ్లు గొర్రెల మంద మీద పడ్డ చందంగా ఈ సర్కార్ భూమిని నమ్ముకున్న రైతులపై పడుతోంది’’ ఆయన ధ్వజమెత్తారు. అసలు ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ నిలదీశారు. గతంలో ఆంధ్ర పాలకుల మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూములను లాక్కునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 123కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. కేవలం 50 టీఎంసీల కోసం ఏకంగా 14 ఊళ్లను ఖాళీ చేయిస్తారా? ఇది మరీ దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ బాధితులకు కడదాకా అండగా నిలుస్తామని కోదండరాం ప్రకటించారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించాడు. కోదండరాం అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానామివ్వాలని డిమాండ్ చేశాడు. భవిష్యత్తులో కోదండరాంతో పనిచేస్తారా అని రేవంత్ ను అడగా, ఈ దొరల పాలనకు వ్యతిరేకంగా కలిసొచ్చే ఎవరినైనా కలుపుకు వెళ్తానని ఆయన వ్యాఖ్యానించం విశేషం. అయితే తాను రాజకీయ శక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కలవనని కోదండరాం ఇదివరకు చాలాసార్లు చెప్పారు లేండి. కానీ, గతంలో మాదిరి జేఏసీని ఏకీకృతం చేస్తానని చెప్పటం, మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆదిశగా అడుగులు పడే అంశాన్ని కూడా కొట్టిపారేయలేం.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles