nine among three women arrested in police raids

Police raids on brothel house in saidabad

sexuall assault, police raids, brothel houses, prostitutes, three woman, six men, saidabad police, hyderabad police, crime

On the tip of the information saidabad police condcted sudden raids and arrested three women and six men in city limits.

పోలీసుల దాడులు.. అదుపులో విటులు, మహిళలు

Posted: 06/07/2016 08:20 AM IST
Police raids on brothel house in saidabad

హైదరాబాద్ నగరాన్ని నేరరహిత నగరంగా మార్చేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నేర చరిత్ర కలిగిన వారు మాత్రం నిత్యం పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఇప్పటికే చైన్ స్నాచర్లు పోలీసులకు నిద్రను కరువయ్యేలా చేస్తుండగా, ఇటీవల కాలంలో దోంగలు కూడా తమ ప్రతాపాన్ని చాటుతున్నారు. తాజాగా నగరంలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా పాష్ ప్రాంతాలను ఎంచుకుని వ్యభిచార గృహాల నిర్వహణ కూడా సాగుతుంది. నగరంలోని సైదాబాద్ లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్నారు పోలీసలు.

దీంతో హుటాహుటిన సదరు వ్యభిచార గృహంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఇన్‌స్పెక్టర్ కె.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం టూఆర్టీ క్వార్టర్స్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు నిర్వహించిన దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసినట్లు ఇన్‌స్పెక్టర్  చెప్పారు.

మహానగరంలో నేరాలను అదుపు చేసేందుకు జనసామార్థ్యం వున్న ప్రాంతాలలో అనేక చోట్ల సిసి కెమెరాలను ఏర్పాటు చేసినా.. నేరస్థులు కొత్త కొత్త పద్దతుల ద్వారా పేట్రోగిపోతూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. కాగా సీసీ కెమెరాలు నేరాలు జరిగిన తరువాత నేరస్థులను పట్టించేందుకు దోహదపడుతున్నాయే తప్ప.. నేరాలను అదుపు చేసేందుకు దోహదపడటం లేదని కూడా పలువరు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పోలీసులు నేరాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles