Hillary Clinton clinches Democratic presidential nomination

Hillary clinton makes history

politics, Hillary Clinton clinches Democratic presidential nomination, Virgin Islands, celebrations, Donald Trump, Sanders

Hillary Clinton clinched the Democratic presidential nomination, according to CNN's delegate and superdelegate count, and will become the first woman in the 240-year history of the United States to lead the presidential ticket of a major political party

చరిత్ర సృష్టిస్తూ.. అధ్యక్ష బరిలో నిలిచిన తొలి మహిళ

Posted: 06/07/2016 11:21 AM IST
Hillary clinton makes history

అగ్రరాజ్యం అమెరికా 240 ఏళ్ల అధ్యక్ష ఎన్నికల చరిత్రను తిరగరాస్తూ మాజీ ప్రథమ మహిళ, ప్రస్తుత డిమెక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తొలిసారిగా బరిలో నిలిచారు. ఇంతకుమునుపెన్నడూ మహిళలు అమెరికా అధ్యక్ష రేసులో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ మాజీ అధ్యక్షుడి భార్యగా, ఆ తరువాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా అమె యావత్ ప్రపంచంపై అవగాహన కలిగిన నేతగా అనతికాలంలోనే ఎదిగారు. ఈ సారి అధ్యక్ష బరిలో నిలిచిన అమెకు సాండర్స్ నుంచి గట్టి పోటీ ఏర్పడింది.

అయినా సాండర్స్ విజయాలను అమె నిలువరించి.. అయనపై పైచేయిని సాధించి ముందంజలోకి వచ్చారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా అమె అమెరికా అధ్యక్ష రేసులో పాల్గోననున్నారు. ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తో అమెరికా అధ్యక్ష ఫీఠాన్ని దక్కించుకునే రేసులో నిలించారు. దేశాధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ ఖరారైంది. ఈ విషయాన్ని ఏజెన్సీ ప్రెస్, యూఎస్ నెట్ వర్క్స్ వెల్లడించాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న శాండర్స్ను అధిగమించి అధ్యక్ష నామినేషన్ కోసం కావాల్సిన 2383 డెలిగేట్లను హిల్లరీ గెలుచుకున్నారు.

ప్యూర్టో రికోలో జరిగిన ప్రైమరీలో హిల్లరీ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. చివరి నిమిషంలో ఆమెకు సూపర్‌డెలిగేట్ ఓట్లు లభించడంతో ఆమె విజయం సాధించినట్లు ఏజెన్సీ ప్రెస్ ప్రకటించింది. హిల్లరీకి 2,383  శాండర్స్ కు 1,5691 డెలిగేట్లు వచ్చాయి. ఫలితాల అనంతరం ఈ విషయాన్ని హిల్లరీ తన ట్విట్టర్ ద్వారా 'గాట్ ప్రైమరీస్ టూ విన్' అంటూ  షేర్ చేసుకున్నారు. ఇక ఇవాళ డెలిగే్ట్ ఓట్లు అధికంగా వున్న కాలిఫోర్నియా, న్యూజెర్సీలతో పాటు ఆరు రాష్ట్రాలలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ సందర్భంగా నిన్న కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ లో అమె మీడియాతో మాట్లాడుతూ.. తన దృష్టంతా ఎన్నికలకు వెళ్లనున్న రాష్ట్రాలపైనే వున్నట్లు చెప్పుకోచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles