కృష్ణానదీ జలాల వ్యవహారం ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిబందనలకు విరుద్ధంగా బేసిన్ సాగునీటి ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తీసుకునే విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ ఆడించినట్లు ఆడుతుందంటూ తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇదివరకే కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌లను కలిసి ఫిర్యాదు చేశారు కూడా. ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిగే వరకు ప్రాజెక్టుల నియంత్రణ జోలికి వెళ్లరాదని ఏపీ పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, దాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులను నోటిఫై చేయాలని కేంద్రానికి బోర్డు సిఫార్సు చేయటం ఏంటనీ హరీశ్ ప్రశ్నించాడు. పోలవరం విషయంలో అభ్యంతరం చెప్పనప్పుడు తమ ప్రాజెక్టులకు ఎందుకు అడ్డు తగులుతున్నారంటూ తుమ్మల కూడా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. బోర్డు తీసుకునే నిర్ణయం విభజన చట్టానుసారం ఉండాలే తప్పించి, ఏ ఒక్క ప్రభుత్వానికో అనుకూలంగా ఉండకూడదని చెప్పాడు.
ఇక ఈ ఆరోపణలపై ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పందించారు. విజయవాడలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ నేతలు ఢిల్లీ వెళ్లి అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అయితే బోర్డు తమకేం అనుకూలంగా లేదన్న విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారు. ఇప్పటికే అపరిమితమైన కేటాయింపులు చాలానే చేశారని, ఈ విషయంలో బోర్డు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరు రాష్ట్రాలు సంతకాలు చేశాక కూడా బోర్డు కొన్ని తప్పులు చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా 512 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయింపులు జరిగాయని వివరించారు. విభజన చట్టాన్ని వారికి నచ్చినట్లుగా మార్పులు చేయించి రూపొందించుకున్న టీఆర్ఎస్సేనని, ఇప్పుడెందుకు జల వివాదాలను లేవనెత్తుతుందని మండిపడ్డారాయన.
ఈ వ్యవహారంలో కమ్యూనికేషన్ గ్యాప్ తో మంత్రుల వ్యవహారం ఎలా ఉన్నా... తమకు సంబంధం లేకపోయినా బోర్డును మధ్యలోకి లాగటం విమర్శలకు తావిస్తోంది. స్వయంప్రతిపత్తి గత బోర్డు ఏ ఒక్కరి ప్రయోజనాలకోసమో పనిచేయదు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అది తన పని తాను చేసుకుపోతుంటుంది. ఇప్పటిదాకా విభజన చట్టంలోని నియమాలకు అనుగుణంగానే సాగిన వ్యవహారాలను విమర్శలతో మరింత జఠిలం చేస్తున్నారంటూ సీనియర్ ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more