రాజ్యసభ బజార్ తోపాటు శాసనమండలి ఎలక్షన్ కోసం కర్ణాటకలో భారీగా ఎమ్మెల్యేల కోనుగోలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో నగదును ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతుందని ఆరోపణలు వినిపస్తున్నాయి. అయితే తామేమీ అభ్యర్థులకు తాయిలాలు ప్రకటించడం లేదని, ఎవరినీ ప్రలోభాలకు గురిచేయడం లేదనీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని, జేడీ అధినేత హెచ్.డి.దేవేగౌడ మండిపడ్డారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది అభ్యర్థుల కొనుగోలు కాకపోతే మరేంటి, గాడిదల వ్యాపారం జరుగుతోందా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను రాజ్యసభకు గెలిపించుకోగలగుతుంది. ఆ తర్వాత వారి వద్ద మిగిలిన 33 ఓట్లకు ఇతర స్వతంత్రులను కలుపుకొని మూడో స్థానాన్ని పొందాలని చూస్తున్నారు. ఆ స్వతంత్రుల ఓట్లు వీరు ఎలా సాధిస్తారు, ఇది ప్రలోభాలకు గురిచేయడం కాక మరేంటని పశ్నిస్తున్నారు. ఇదేమన్నా గుర్రాల, గాడిదల వ్యాపారమా? ఇష్టం ఉన్నట్లు కొనుగోలు చేయడానికి అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఎన్నికలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ నుంచి ఎన్నో ఫలాలు పొంది ఎదిగిన నేతలు, ఇప్పుడు సొంత పార్టీకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని దేవగౌడ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల కొనుగోలుకు సంబంధించి వెలుగుచూసిన స్టింగ్ ఆపరేషనలో జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాజకీయాల్లో అవినీతి సహజమని, ఎమ్మెల్యేలకు ఖర్చులుంటాయని సొంత ఎమ్మెల్యేలను దేవగౌడ వెనుకేసుకొచ్చిన సంగతి తెలిసిందే.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more