అథ్లెట్ అంజూకి క్రీడా మంత్రి వేధింపులు | Anju Bobby George harassed minister Jayarajan

Anju bobby george harassed minister jayarajan

Anju Bobby George, Pinarayi Vijayan, Sports Minister EP Jayarajan, Anju Jayarajan, అంజూ జార్జి వేధింపులు, రాజన్ వేధింపులు, అంజూ జార్జి రాజన్, క్రీడామంత్రి వేధింపులు, తెలుగు వార్తలు, క్రీడా వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news

Sportsperson Anju Bobby George has submitted a complaint to Kerala Chief Minister Pinarayi Vijayan alleging that Sports Minister EP Jayarajan had harassed her and other members of the Kerala Sports Council. Minister Jayarajan had earned notoriety in the past few days when he declared on the occasion of Muhammed Ali’s death that it was a great loss for Kerala, as he had won many medals for the state.

అథ్లెట్ అంజూకి క్రీడా మంత్రి వేధింపులు

Posted: 06/09/2016 03:14 PM IST
Anju bobby george harassed minister jayarajan

కేరళకు చెందిన ప్రముఖ ఆథ్లెట్ అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌ కి, ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి జయరాజన్ కు మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. ఆమె అక్రమాలకు పాల్పడుతోందంటూ రాజన్ ఆరోపిస్తే, జయరాజన్ తనను వేధిస్తున్నాడంటూ అంజూ నేరుగా కేరళ సీఎం పినరయి విజయన్ కు ఫిర్యాదు చేసింది. తాజాగా అక్కడి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి పినరయి విజయన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళ క్రీడల మండలి అధ్యక్షురాలిగా ఉన్న ఆమె తన మండలి సభ్యులతో కలిసి క్రీడా శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన రాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసింది.

ఈ సందర్భంగా ఆయన వారితో అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విపక్షానికి చెందిన వారంటూ నిందలేశారంట. తన నుంచి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారంట. ప్రోత్సహించాల్సిన క్రీడా శాఖ మంత్రి నుంచే వేధింపులు ఎదురవడంతో షాక్ తిన్న ఆమె సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజాగా బాక్సింగ్ దిగ్గజం మహ్మదాలీ చనిపోయినప్పుడు జయరామన్ చేసిన వ్యాఖ్యలపై అంజూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆలీ కేరళకు చెందిన వారని, రాష్ట్రానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టారంటూ జయరాజన్ వ్యాఖ్యానించాడు. ఓ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు దానిపై కనీస జ్నానం లేకుండా ఎలా ఉంటారంటూ అంజూ ఆ వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది.

కట్ చేస్తే... ఆ తర్వాత మండలి కార్యకలాపాల నిమిత్తం ఆమె ఇటీవల బెంగళూరు వెళ్లాల్సిన పని పడింది. ఇందుకోసం ఆమె విమానప్రయాణం చేయగా, దీనికి సంబందించిన బిల్లులను మంజూరు చేయకపోవడంతోపాటు ఆమె అవినీతికి పాల్పడుతోందని జయరాజన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక మంత్రి క్లియరెన్స్ ద్వారానే తామంతా ఫ్లైట్ లో ప్రయాణించినట్లు ఆమె వివరణ ఇచ్చుకుంది. చివరకు  క్రీడా శాఖ మంత్రి నుంచి ఇలా వరుసగా వేధింపులతో మనసు నొచ్చుకున్న అంజూ నేరుగా సీఎం విజయన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న విజయన్ దీనిపై తాను పరిశీలన చేసి చర్యలు తీసుకుంటానని ఆమెకు హామీ ఇచ్చి పంపారంట.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anju Bobby George  Pinarayi Vijayan  Sports Minister EP Jayarajan  Anju Jayarajan  

Other Articles