ఏ మాత్రం శాస్త్రీయత లేకపోయినా సరే వైద్యం పేరుతో మూగజీవాల ప్రాణాలను హరించడం మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఈ విషయంలో చైనీయులు ఓ మెట్టు ముందే ఉన్నారు. సాంప్రదాయ వైద్యం పేరిట పులులను బలి తీసుకోవటం తాజాగా మనం చూశాం. ఇక వారు అమితంగా ఇష్టపడే పాముల విషయంలోనూ ఇప్పుడు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇక్కడ ఇష్టపడటం అంటే పెంచుకోవటం కాదు...లాగించేయడం. కప్పలను, పాములను ఎంతో ఇష్టంగా తినే చైనీయులు ఇప్పుడ వాటితో ప్రయోగాలను చేస్తున్నారు.
తాజాగా పాములతో ఓ మధుర పానీయాన్ని తయారు చేసి లక్షలు గడిస్తున్నారు ఆ దేశవాసులు. పాముతో పానీయం ఏంటనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. పాముల రక్తం, విషంతో కుళ్లబెట్టిన వైన్ ఇప్పుడు అక్కడ హాట్ హాట్ గా అమ్ముడు పోతుంది. అయితే ఇప్పటి ఆచారం ఏం లకాదంట.. 2700 సంవత్సరాల ముందు నుంచే ఉందని తెలుస్తోంది. ఇక దీని తయారీ విధానం తెలిస్తే మీరు ఇంకోసారి మందు జోలికెళ్లరంటే నమ్మండి.
ముందుగా పాముల్ని తెచ్చి శుభ్రంగా కడుగుతారు. ఆపై దాని విషం, రక్తం ఓ బాణీలో తీసుకుంటారు. ఆపై బ్లేడ్ తో ఓ బ్లేడ్ తో చర్మం మధ్యలో గాటుపెడతారు. లోపలి పేగులను తొలగించి, దాన్ని అలాగే ఓ గాజు సీసాలోని ద్రావణంలో పడేస్తారు. ఇలా ఓ నాలుగైదు పాముల నుంచి సేకరించిన రక్తం, విషంను ఒకే సీసాలో పెట్టి, దానికి కొన్ని మూలికలు కలిపి ఆపై 40 రోజుల దాకా దాన్ని కుళ్లబెడతారు. అంతే రుచికరమైన స్నేక్ వైన్ తయారయినట్లే. ఇక దీని రేటు ఎంతో తెలుసా? కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే. షాపుల్లోనే కాదు ఆన్ లైన్లో కూడా వీటి అమ్మకం జోరుగా సాగుతుందట.
పాము రక్తం, విషం కలిస్తే ఓ దివ్య ఔషధమని, ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వారు భావిస్తున్నారు. దీని రుచి మరిగిన విదేశీయులు ఇప్పుడు చైనాకు క్యూ కడుతున్నారంట. తైవాన్, వియత్నాం, హాంగ్ కాంగ్ లలో స్నేక్ వైన్ కు ఫుల్ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది. వెన్ను, కీళ్ళ నొప్పులు, జుట్టు రాలడం వంటి సమస్యలకు ఇది అద్భుత ఔషదంగా పనిచేస్తుందని పలువురు విశ్వసిస్తున్నారు. ఇక సీసాలో వేసిన పాములను ఏం చేస్తారనేగా మీ అనుమానం. కొందరు వాటి తోళ్లను అమ్మి గిట్టుబాటు చేసుకుంటే, మరికొందరు ఆ పాములను సదరు వైన్ లోనే ఉంచి కుళ్లబెడతారంట.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more