indian home secretary in party mood while mumbai attacks

Indian home secretary in party mood while mumbai attacks

home secretary Madhukar Gupta, Madhukar Gupta pak, Madhukar Gupta mumbai attacks, Madhukar Gupta party mood, pak mumbai attacks, పాక్ మధుకర్ గుప్తా, ముంబై దాడులు, ముంబై దాడులు మధుకర్ గుప్తా, టైమ్స్ ఆఫ్ ఇండియా మధుకర్ గుప్తా, మధుకర్ గుప్తా ఎంజాయ్ చేశారు, ముంబై దాడుల సమయంలో మధు ఎంజాయ్, తెలుగు వార్తలు, రాజకీయాలు, జాతీయ వార్తలు, latest news, telugu news

home secretary Madhukar Gupta in pakisthan while mumbai attacks. some senior officials were persuaded by the hosts to extend their stay by a day at the picturesque hill retreat of Murree.

ముంబై తగలబడిపోతుంటే ఆయన ఎంజాయ్ చేశారా?

Posted: 06/11/2016 10:07 AM IST
Indian home secretary in party mood while mumbai attacks

రోమన్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి తీరిగ్గా కూర్చుని ఫిడేల్ వాయించినట్లు.... ముంబైలో ఓ పక్క మారణహోమం జరుగుతుంటే కీలక అధికారి ఒకరు తన అనుచర గణంతో ఫుల్ గా ఎంజాయ్ చేశారంట. నవంబర్ 26, 2008 సముద్ర మార్గం గుండా అక్రమంగా చొరపడిన 10 మంది ఉగ్ర రాక్షసులు వాణిజ్య నగరంపై విరుచుకుపడ్డారు. గంటల తరబడి జరిగిన ఈ ఉగ్రదాడిలో 178 మంది అమాయకులను బలితీసుకున్నారు. కసబ్ అండ్ కో చేసిన ఈ దాడులను తలుచుకుని ముంబై వాసులు ఇప్పటికీ వణికిపోతుంటారు. అలాంటిది అంత పెద్ద దాడులు జరుగుతున్న సమయంలో మన హోం శాఖ అధికారులు మాత్రం పార్టీలో మునిగిపోయారంట. అది కూడా పాకిస్థాన్ లో...

వివరాల్లోకెళితే దాడులు జరిగిన ఓ రెండు రోజుల ముందు అంటే నవంబర్ 26న భారత్, పాక్ హోం శాఖ కార్యదర్శుల సమావేశం జరిగింది. ఇస్లామాబాద్ లో జరిగిన ఈ భేటీకి అప్పటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మధుకర్ గుప్తా కొంత మంది ఉన్నతాధికారులతో హాజరయ్యారు. అదే రోజు సాయంత్రానికే చర్చలు ముగిశాయి. అయితే వెంటనే ఇండియాకు తిరిగి రావటానికి ఆయనకు మనసొప్పలేదు. మర్నాడు వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మిగతా అధికారులు కూడా సై అన్నారు. దీంతో పాక్ అదికారులు ఆయన్ను పర్వత ప్రాంతం ముర్రీలోని ఓ లగ్జరీ హోటళ్లో ఉంచారు. అక్కడ రాత్రంతా గ్రాండ్ గా వారంతా పార్టీ చేసుకున్నారు. దీంతో దాడి జరిగిన సమయానికి ఆయన అక్కడ ఉండటంతో కౌంటర్ అటాక్ కాస్త ఆలస్యమయిందంటూ ఓ ప్రముఖ జాతీయ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది.  

అయితే దీనిపై మరో కోణం కూడా ఉన్నట్లు అదే కథనంలో పేర్కొంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి (హోం మంత్రి)తో భేటీ నిమిత్తమే మధుకర్ గుప్తా అక్కడ ఉండాల్సి వచ్చింది. చర్చల సందర్భంగా అందుబాటులో లేని పాక్ మంత్రి మరునాడు మధుకర్ గుప్తా బృందంతో భేటీ అవుతానని చెప్పారు. ఇదే విషయాన్ని నాటి హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తో పాటు ఇతర అదికారులకు తెలిపిన మధుకర్ గుప్తా పాక్ లోనే బస చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలో మధుకర్ గుప్తా బృందాన్ని పర్వత ప్రాంతం ముర్రీకి తరలించించారు పాక్ అధికారులు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అందని ప్రాంతానికి మధుకర్ ని తరలించడతో కావాలనే పాక్ ఆయన్ను అక్కడ కట్టడి చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మరుసటి రోజు భేటీ ముగించుకున్న అనంతరం 28 మధ్యాహ్నానికిగానీ ఆయన ఇండియాకు రాలేకపోయారు. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని తెలిపింది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles