Former Karnataka Police Officer Anupama Shenoy Claims Threat To Life

Former karnataka police officer anupama shenoy claims threat to life

Anupama Shenoy, Anupama Shenoy resignation accepted, P T Parameshwar Naik,Anupama Shenoy Resignation, Former Woman Police Officer, former DSP, Threat To Life, Kudligi DSP

A former senior Karnataka woman police officer, who resigned from her post over alleged inteference in her work by a district-in-charge minister, claimed her life was under threat.

సవాల్ విసిరిన మాజీ డీఎస్సీ అనుపమకు ప్రాణహాని..

Posted: 06/11/2016 11:31 AM IST
Former karnataka police officer anupama shenoy claims threat to life

అమాత్యులకు సవాల్ విసిరి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ కు ఇప్పడు తాజా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగంలో వుండగానే తనపై హుకుం చెలాయించాలని చూసిన నేతలు.. ప్రస్తుతం తనను టార్గెట్ చేసే అవకాశాలు వున్నాయి. దీంతో అనుపమ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

అయితే ఎవరి నుంచి ప్రాణహాని ఉందన్న విషయాలను అమె వెల్లడించలేదు. ఈ మేరకు అమెకు బెదిరింపులు ఏమైనా వచ్చాయా అన్న విషయాలను ఆమె మీడియా ముందు చెప్పలేదు. కాగా, కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్కు సంబంధించిన సీడీ, ఆడియోలు తన వద్దనున్నాయని బహిరంగంగా వెల్లడించిన అమె వాటిని త్వరలోనే బెంగళూరులో మీడియా సమక్షంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆయన మూలంగానే అమెకు బెదిరింపులు వచ్చాయా.. అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

అనుపమ రాజీనామా వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె రాజీనామా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాసలీలల వీడియో తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపన అనుపమ రెండు రోజుల క్రితం కుడ్లిగి వచ్చారు. కాగా అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినందుకు బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Former Woman Police Officer  former DSP  Anupama Shenoy  Threat To Life  Kudligi DSP  

Other Articles