President Obama endorsed someone with ‘criminal investigation’: Donald Trump

Barack obama and elizabeth warren officially endorse hillary clinton

us elections, us elections 2016, donald trump, trump, presidential nominee donald trump, us president barack obama, hillary clinton,obama endorsed hillary clinton

This was Trump's first public rally since Obama endorsed Clinton as Democratic presidential nominee against Senator Bernie Sanders from Vermont.

అధ్యక్షుడి వ్యాఖ్యలతో రిపబ్లికన్ అభ్యర్థి విస్మయం

Posted: 06/11/2016 04:58 PM IST
Barack obama and elizabeth warren officially endorse hillary clinton

నడిరోడ్డుపై ఒక వ్యక్తిని కాల్చినా తనను అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ఎవరూ అడ్డుకోలేరని అనడంతో పాటు అనేక సందర్బాల్లో రెచ్చగోట్టే వ్యాఖ్యాలు చేసిన డోనాల్డ్ ట్రంప్ కు అమెరికా అధ్యక్షుడు నిర్ణయం దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లుంది. తనను అమెరికా అధ్యక్షుడు కాకుండా ఎవరు అడ్డుకోలేరని బీరాలు పోయిన ట్రంప్.. అగ్రరాజ్య అధ్యక్షుడి నిర్ణయంపై తాజాగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేర అభియోగాలు ఎదుర్కొంటున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను అధ్యక్షుడు ఒబామా బలపరుస్తున్నారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు.

అయినా సరే నవంబర్లో జరిగే ఎన్నికల్లో హిల్లరీని ఎదుర్కోవడానికి సిద్థంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. హిల్లరీకి ఒబామా మద్దతు ప్రకటించిన తరువాత వర్జీనియాలోని రిచ్మండ్లో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. నేర అభియోగాలు ఎదుర్కొటున్న వారికి దేశాధ్యక్షుడు మద్దతు తెలుపుతున్నారని, అయితే దేశం ఇదే కోరుకుంటుందా అని ర్యాలీకి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. ప్రస్తుత డెమోక్రటిక్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.

ఇటీవల ఇండియన్ అమెరికన్ రాజీవ్ ఫెర్నాండోకు కీలక పదవిని కట్టబెట్టడానికి కారణం అతడు క్లింటన్ ఫౌండేషన్కు ఎక్కువ మొత్తంలో డొనేషన్లు చెల్లించడమేనన్నారు. మెక్సికో, చైనాలాంటి దేశాలు అమెరికాను నాశనం చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం దేశ వర్తక వ్యవహారాలు చూస్తున్న వ్యక్తులు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. మెక్సికో బార్డర్లో గోడను నిర్మిస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. పరిశ్రమలను అమెరికాలోనే నెలకొల్పేలా చూడటం ద్వారా దేశంలో ఉపాధిని పెంపోందించాలన్నారు. అమెరికాకు దక్కాల్సిన వేలాది ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barrack obama  US president  US presidential elections  donald trump  hillary clinton  

Other Articles