Zimbabwe v/s India: Led by Bumrah, Indian pacers bundle out hosts for 168

India bowl out zimbabwe for 168

Zimbabwe v/s India, Cricket, Zimbabwe, Chamu Chibhabha, Elton Chigumbura, Harare, Jasprit Bumrah, Dhawal Kulkarni, Axar Patel, Barinder Sran, Craig Ervine, Hamilton Masakadza, Karun Nair, Mahendra Singh Dhoni, peter moor, Richmond Mutumbami, Sikandar Raza, Vusi Sibanda

The Indian pacers made good use of the conditions to bowl out hosts Zimbabwe for a meagre 168 in the first ODI of the three-match cricket series in Harare

జింబాబ్వేను స్వల్ప స్కోరుకే అలౌట్ చేసిన టీమిండియా

Posted: 06/11/2016 04:14 PM IST
India bowl out zimbabwe for 168

మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ అతిథ్య జట్టు జరిగిన తొలి వన్డేలో భారత యువ జట్టు జింబాబ్వేను స్వల్ప స్కోరుకే నియంత్రించగలిగింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వేను భారత్ బౌలర్లు 168 పరుగులకు అలౌట్ చేశారు. దీంతో భారత్ ఎదుట 169 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.  జింబాబ్వే జట్టులో చిగుంబరా(41)మినహా ఎవరూ ఆకట్టుకోలేదు టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

దీంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే ఆటగాళ్లలో మూర్(3),  మసకద్జా(14) , చిబాబా(13) స్వల్ప విరామాల్లో  నిష్క్రమించడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. అనంతరం సిబందా(5), ఎర్విన్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఆపై చిగుంబరాకు జత కలిసిన సికిందర్ రాజా(23) జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జింబాబ్వే వికెట్లకు కాసేపు బ్రేక్ పడింది.

కాగా, సికిందర్ రాజా ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాక, మరోసారి జింబాబ్వే తడబడింది. అయితే చిగుంబరా తొమ్మిదో వికెట్గా వరకూ క్రీజ్ లో ఉండటంతో జింబాబ్వే 168 పరుగుల సాధారణ స్కోరును నమోదు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు తీసి జింబాబ్వే నడ్డి విరిచాడు. బూమ్రా 9.5 ఓవర్లలో రెండు మేడిన్ల సాయంతో  28 పరుగులు ఇచ్చాడు. టీమిండియా మిగతా బౌలర్లలో బరిందర్ శ్రవణ్, కులకర్ణిలు తలో రెండు వికెట్లు సాధించగా, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్లు చెరో వికెట్ లభించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ind vs zim 2016  India  Cricket  Zimbabwe  bumrah  dhoni  

Other Articles