brothel house busted in hayath nagar, three arrested

Police raids brothel house in hayath nagar arrests three

brothel house, Three arrested, hayathnagar, cyberabad police, prostitute arrested in hayathnagar, raid on brothel house, brothel house organiser arrested

cyberabad police raid brothel house in hayath nagar and arrest three including one woman organiser and one prostitute

గుట్టుగా బ్రోతల్ దందా.. రట్టు చేసిన పోలీసులు

Posted: 06/12/2016 08:31 AM IST
Police raids brothel house in hayath nagar arrests three

నేరరహిత రాజధాని ఏర్పాటు దిశగా పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. హైదరాబాద్ లో నేర ప్రవృత్తి కలిగిన వారికి కొదవ మాత్రం లేకుండా పోతుంది. కొత్త కొత్త పద్దతుల ద్వారా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే ఎన్ని పద్దతులు మార్చినా చివరకు పోలీసులకు చిక్కక తప్పదని వారు పట్టబడే వరకు వారికే తెలియదు. తాజాగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్‌ గుట్టురట్టయింది.  ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ఓ మహిళ, విటున్ని అరెస్ట్ చేశారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. గడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్‌లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. బహదూర్‌పురాకు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brothel house  Three arrested  hayathnagar  cyberabad police  crime  

Other Articles