Tejaswi Yadav says BJP's Giriraj Singh associated with prime accused

Tejaswi attack giriraj singh for links with bihar s toppers scam mastermind baccha rai

Bihar toppers scam, union minister Giriraj Singh, Lalu Prasad Yadav, bihar deputy cm Tejaswi yadav, toppers scam mastermind Baccha Rai, medical collage, toppers scam

Lalu and son Tejaswi Yadav have released pictures of Union Minister Giriraj Singh with toppers scam mastermind Baccha Rai

కేంద్రమంత్రి గిరిరాజ్ ప్రోద్భలంతోనే బిహార్ టాపర్స్ స్కామ్

Posted: 06/13/2016 09:07 AM IST
Tejaswi attack giriraj singh for links with bihar s toppers scam mastermind baccha rai

బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాప్ ర్యాంకు స్కాంతో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు ప్రమేయం వుందా.? బీజేపి కావాలనే బీహార్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈ కుట్రకు తెరతీసిందా..? అంటే అవుననే అంటున్నారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్. ఈ మేరకు ఆయన సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి ప్రమేయంపై ఆరోపణలు గుప్పించారు. కేంద్రమంత్రి ప్రోత్భలంతోనే ఈ కుంభకోణం జరిగిందని అయన అరోపించారు.

టాపర్స్ స్కాంలో ప్రధాన నిందితుడు బచ్చారాయ్.. కేంద్రమంత్రి గిరిరాజ్ కు సన్నిహితుడని వెల్లడించారు. వైశాలి జిల్లాలో బిషన్ రాయ్ కాలేజీ సెక్రటరీ, ప్రిన్సిపాల్ గా ఉన్న బచ్చారాయ్ కేంద్రమంత్రి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలుచేయాలనే ఈ కుంభకోణానికి తెరతీశారని తేజస్వీ అరోపించారు. అయితే టాపర్స్ స్కాంలో ప్రధాన నిందితుడు బచ్చారాయ్ తో గిరిరాజ్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ వీరిద్దరూ కలిసివున్న ఫొటోను తేజశ్వి యాదవ్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తో రాయ్.. పక్కనే కూర్చోని వున్నారంటూ కామెంట్ పెట్టారు. రాయ్ తో గిరిరాజ్ కు వ్యాపార సంబంధాలున్నాయని కూడా ఆరోపించారు. రాయ్ తో మెడికల్ కాలేజీ పెట్టేందుకు సహాయం చేస్తానని గిరిరాజ్ హామీయిచ్చారని ఆర్జేడీ రోపించింది. అందుచేత రాయ్ ఈ కుంభకోణానికి పాల్పడ్డారని అరోపించారు. కాగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అరోపణలు ఎదుర్కోంటున్న రాయ్ శనివారం భగ్వాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపు పరీక్షల్లో ఈ కాలేజీకి చెందిన రుబీరాయ్, సౌరబ్ శ్రేష్ట్ లు టాప్ ర్యాంకులు సాధించడం తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar merit list scam  Tejaswi Yadav  Giriraj Singh  Bachcha Rai  toppers scam  

Other Articles