యువనటుడి మృతిపై అనుమానాలు? | Anton Yelchin died in road accident

Anton yelchin died in road accident

Actor Anton Yelchin, Star Trek hero, Star Trek hero died, Actor Anton Yelchin road accident, Actor Anton Yelchin suspicious death, హాలీవుడ్ యువనటుడు అంటోన్ యేల్చిన్, latest news, entertainment, hollywood news, young hero died, తెలుగు వార్తలు, తాజా వార్తలు, సినిమా వార్తలు, ఎంటర్ టైన్ మెంట్ వార్తలు

Actor Anton Yelchin, 27, who played Chekov in recent "Star Trek" movies, was killed in a freak accident early Sunday morning, police told CNN. Yelchin, who also acted in "Like Crazy" and "Alpha Dog," died outside his home in Los Angeles, according to law enforcement.

యువనటుడి మృతిపై అనుమానాలు?

Posted: 06/20/2016 09:46 AM IST
Anton yelchin died in road accident

హాలీవుడ్ యువనటుడు అంటోన్ యేల్చిన్ (27) మరణంపై పలువురు సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్టార్ ట్రెక్ సిరీస్ లలో చెకోవ్ పేరుతో పాపులర్ అయిన ఈ యువనటుడు ఆదివారం ఉదయం లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. అయితే ప్రస్తుతం అతని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

రష్యా దేశంలో జన్మించిన యెల్చిన్ ఫ్యామిలీ ఆ తర్వాత అమెరికాకు తరలిపోయింది. కాగా, రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని పబ్లిసిస్ట్ జెన్నిఫర్ అలెన్ నిర్ధారించింది. లైక్ క్రేజీ, అల్ఫా డాగ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న యెల్చిన్ ఆ తర్వాత స్టార్ ట్రెక్ చిత్రాలతో గుర్తింపుపొందాడు. చారీ బార్ట్‌లెట్ లాంటి టీనేజ్ కామెడీ సినిమాలతో అమ్మాయిల్లో అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అతను నటించిన చివరి చిత్రం స్టార్ ట్రెక్ బియాండ్ (మూడో సిరీస్)లో జూలైలో విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాల్ని దయచేసి అడొగద్దని అతని తల్లిదండ్రులు కోరటం పై అనుమానాలు రెకెత్తుతున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Anton Yelchin  Star Trek hero  hero died  Actor road accident  

Other Articles