గుత్తా కడుపు మంట చల్లారిందా? | Gutha Sukender Reddy says why he quit congress

Gutha sukender reddy says why he quit congress

gutha reveals nalgonda congress clashes, komatireddy and uttam fight leads gutha quit congress, gutha explained why he quits TRS, గుత్తా చేరిక వెనక మంతనాలు, గుత్తా కడుపు మంట చల్లారిందా, గుత్తా కాంగ్రెస్ ను ఎందుకు వీడాడంటే, నల్గొండ రాజకీయాల గురించి గుత్తా, గుత్తా ఎందుకు హ్యండిచ్చాడు, కోమటిరెడ్డి, ఉత్తమ్ కారణమా, తెలుగు వార్తలు, తెలంగాణ వార్తలు, తెలంగాణ రాజకీయాలు, latest news, telugu news, politics, telangana politics, gutha fire on revanth reddy

Nalgonda MP Gutha Sukender Reddy says why he quit congress. Congress internal clashes main reason for he quits congress and join TRS.

గుత్తా కడుపు మంట చల్లారిందా?

Posted: 06/21/2016 04:27 PM IST
Gutha sukender reddy says why he quit congress

రాజకీయ భవిష్యత్తుపై బెంగతో పార్టీ మారుతున్న నేతలు తమ నియోజకవర్గ సంక్షేమం, ప్రజల బాగుకోసమే తామంతా అధికార పక్షం పంచన చెప్పటం ఇప్పటిదాకా మనం చూశాం. కానీ, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. అసలు తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో వివరిస్తున్నాడు. మంగళవారం నల్గొండలో  టీఆర్ఎస్ ప్రతినిధి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లా కాంగ్రెస్ రాజకీయాల కుమ్ములాట గురించి బయటపెట్టేశాడు.

పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చూసి తట్టుకోలేకనే తాను గులాబీ తీర్థం తీసుకున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిత్యమూ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉంటుంటే చూడలేకపోయానని, వారంతా పార్టీ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని, అందువల్లే పార్టీని వీడానంటూ ఆయన ఆయన చెప్పుకోచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలెవరికీ తనను విమర్శించే అర్హత లేదన్నారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని నమ్మి తాను పార్టీ మారినట్లు గుత్తా స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడు తాను కాంగ్రెస్ నుంచి సంక్రమించిన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులు ఘాటు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాక్కుంటూ కేసీఆర్ రాజకీయ వ్యభిచారానికి తెరతీశారని రేవంత్ వ్యాఖ్యానించాడు. దీనిపై గుత్తా స్పందిస్తూ... కేసీఆర్ వైఖరిని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేస్తున్న రాజకీయ వ్యభిచారం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు తప్పు చేస్తున్నట్టుగా రేవంత్ ఎందుకు చెప్పడం లేదని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డిని సాంఘిక బహిష్కరణ చేయాలని, తెలంగాణలో ఆయన్ను తిరగనివ్వరాదని గుత్తా వ్యాఖ్యానించాడు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nalgonda MP  Gutha Sukender Reddy  komati reddy  Nalgonda congress  uttam kumar  

Other Articles