ఆదాయపు పన్ను కట్టకపోతే అన్నీ కట్? | All benifts cut to wilful tax defaulters

All benifts cut to wilful tax defaulters

Why IT block PAN, LPG subsidy cancelled by govt, All benifts cut to wilful tax defaulters, bad time to wilful tax defaulters, పన్ను ఎగడితే అన్నీ కట్, అన్నీ కట్ చేస్తారంట, వారికి అన్నీ కట్ చేస్తారంట, పన్ను ఎగొట్టారో జాగ్రత్త, ఐటీ శాఖ షాకింగ్ నిర్ణయాలు, ఐటీ ఎగ్గొడితే అన్నీ కట్, తాజా వార్తలు, జాతీయ వార్తలు, తెలుగు వార్తలు, ఆదాయపు పన్ను కట్టకపోతే అన్నీ కట్, IT department PAN and LPG subsidy, telugu news, taajavarthalu

In order to cripple and check the activities of wilful tax defaulters, the Income Tax department has decided to "block" Permanent Account Number (PAN) of such entities, get their LPG subsidy cancelled and take measures to ensure that they are not sanctioned loans.

అలర్ట్: ఆదాయపు పన్ను కట్టకపోతే అన్నీ కట్?

Posted: 06/21/2016 04:31 PM IST
All benifts cut to wilful tax defaulters

ఆదాయ పన్ను కట్టకుండా తప్పించుకు తిరిగే వారికి త్వరలో గడ్డుకాలం రాబోతుంది. కావాలని ప్రభుత్వపు ఖజానాకు గండి కొడుతున్న వ్యక్తుల పూర్తి జాతకాన్ని అందరికీ అందుబాటులో ఉంచడంతోపాటు, పేపర్ లో యాడ్ ఇచ్చి మరీ పరువు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదాయపు శాఖ సిఫార్సుల మేరకు వారికి లభించే అన్ని రకాల సౌకర్యాలను నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది.

ఇందులో భాగంగా ముందు ఆయా వ్యక్తలు పాన్ కార్డు ను  బ్లాక్ చేస్తారు. తద్వారా వారి బ్యాంకు లావాదేవీలు, సర్వీసులు నిలిపేయటంతోపాటు లోన్లు కూడా ఇవ్వరు. పాన్ కార్డు నిలిపివేసి ఆ సమాచారాన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పంపటం, తద్వరా వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను అడ్డుకోవటం లాంటివి చేస్తారు. అంతేకాదు గ్యాస్ సబ్సిడీ రద్దుచేయటం, ఆఖరికి కొత్తగా కొనుగోలు చేసే ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం జరగకుండా ఆపేస్తారంట.

ఆపై వారి పూర్తి సమాచారాన్ని సేకరించి జాతీయ పత్రికల్లో వారి పేర్లను ప్రముఖంగా ప్రచురించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమాచారాన్ని నేమ్ అండ్ షేమ్ పేరిట ఓ జాబితా తయారు చేసిన నెట్ లో పెట్టాలని నిర్ణయించింది. కొత్తగా తీసుకునే ఈ నిర్ణయాలకు భయపడి కొందరైనా టైం కి ఆదాయపు పన్ను చెల్లిస్తారని ఆశిస్తోంది ఐటీ శాఖ.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wilful tax defaulters  IT department  LPG subsidy  tax evasion  

Other Articles