లోకమంతా యోగా అక్కడ మాత్రం.... | nitish govt celebrates music day instead of yoga day

Nitish govt celebrates music day instead of yoga day

nitish sweet recenge on modi, Bihar govt conducting music day instead of Yoga, bihar sounds loud on yogaday, bihar ignore yogaday, no yogaday in bihar, బీహార్లో మ్యూజిక్ డే, యోగాను పక్కనబెట్టి డాన్సులు చేశారు, మోదీపై కోపంతో నితీశ్ ఏం చేశాడంటే, ప్రపంచ సంగీత దినోత్సవం, బీహార్ లో యోగా సందడి లేదు, తాజా వార్తలు, జాతీయ వార్తలు, మోదీ నితీశ్, తెలుగు వార్తలు, రాజకీయాలు, national news, political news, taajavarthalu, telugu news, latest news

Ahead of the International Yoga Day on June 21, Bihar Chief Minister Nitish Kumar said the ancient discipline is “irrelevant without imposing ban” on sale of liquor across the country and appealed Prime Minister Narendra Modi to act in this regard. Bihar govt conducting music day instead of Yoga day.

లోకమంతా యోగా అక్కడ మాత్రం....

Posted: 06/21/2016 06:04 PM IST
Nitish govt celebrates music day instead of yoga day

ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా కాకపోయినా ఏదో ఒక విషయంపై మోదీపై సెటైర్లు వేస్తూనే ఉంటాడు. అదే క్రమంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోదీని పాపులర్ చేసిన యోగా డే పై నితీశ్ దృషిసారించాడు. భారత్ తోసహా ప్రపంచ దేశాలన్నీ యోగా జపం చేస్తున్న తరుణంలో మోదీపై కోపంతో భిన్నమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి తన కసి తీర్చుకున్నాడు.

కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ఆధర్వ్యంలో పాట్నాలో యోగా సంబరాలకు జేడీయూ నేతలెవ్వరూ హజరుకాకుండా నితీశ్ చూసుకున్నాడు. అంతేకాదు యోగా ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే చూస్తుంది తప్ప దాని వల్ల ఒరిగేదేం లేదంటూ చెబుతున్నాడు.  ‘‘యోగా సర్వరోగాలకు సహజసిద్ధమైన ఔషధంలాంటిది కానీ, మద్యం దాన్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా లిక్కర్ బ్యాన్ చేయకుండా ఇలాంటి డేలను ఎన్ని నిర్వహించినా లాభం లేదంటూ’’  తన అసంతృప్తిని వెల్లగక్కాడు. నిజానికి నేను చిన్నప్పటినుంచి యోగా చేస్తున్న కానీ, ఎన్నడూ జనాలకు చూపించుకోవాలని ప్రయత్నించలేదంటూ పరోక్షంగా మోదీకి చురకలంటించాడు.

అసలు విషయం ఏంటంటే... బీహార్లో అధికారంలోకి రాగానే ఆయన మద్యపాన నిషేధం అమలు చేశాడు. దానికి బీజేపీ తరపున ఎలాంటి మద్ధతు లభించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన నితీశ్ యోగా డేకు జేడీయూ తరపున ఎవరూ హజరు కాకుండా చూసుకున్నాడు. అంతేకాదు జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం కావటంతో బీహార్ లో దాన్ని ఆర్భాటంగా నిర్వహించాలని నేతలకు సూచించాడు కూడా. ఓవైపు ప్రపంచమంతా యోగా ధ్యానంలో ప్రశాంతంగా ఉండిపోతే, బీహార్లో మాత్రం వెరైటీగా లౌడ్ స్పీకర్లు, సంగీతం, డాన్సులతో హోరెత్తిపోతుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar CM nitish  world yogaday  world Musicday  bihar ignore yogaday  

Other Articles