EU referendum: polls and live Brexit results so far

Uk s historic brexit referendum on a knife edge

Brexit, capital flight, FIIs, India UK trade, India-UK connection, SEBI, Stock market, brexit, vote, counting, sanderland, result, indians, indian vote divided, european union

A vote to exit the European Union in the referendum could leave Britain's economy more than 5 percent smaller by 2019 than if it stays in the 28-nation club, said the IMF last week.

బ్రెగ్జిట్‌ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ.. నెక్ టు నెక్ పోటీ..

Posted: 06/24/2016 07:16 AM IST
Uk s historic brexit referendum on a knife edge

బ్రిగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన రెఫరెండంలో భారతీయ సంతతి ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఓట్లేశారు. దేశంలో ఉన్న 1.2 మిలియన్ల భారత సంతతి ఓటర్లలో అధిక శాతం బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేసినట్టు తెలుస్తోంది. యూకే భవిష్యత్తును నిర్ణయించే ఈ రెఫరెండంపై ఇటీవల నిర్వహించిన సర్వే విషయాలను బ్రిటిష్ ఎలక్షన్ స్టడీ వెల్లడించింది. ఐరోపా సమాఖ్య(ఈయూ)లో బ్రిటన్ కొనసాగాలా వద్ద అనే దానిపై నిర్వహించిన రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. సండర్లాండ్ నుంచి వెలువడిన తొలి ఫలితంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు చేస్తూ అక్కడి ఓటర్లు ఈయూ నుంచి విడిపోవాలనే ఆకాంక్షకు వెలిబుచ్చారు.

ఇక్కడి ఫలితాల్లో విడిపోవాలని 82,394 ఓట్లు, కలిసి ఉండాలని 51,930 ఓట్లు రావడం విశేషం.  పూర్తి ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడనున్నాయి. మొత్తం 382 కౌంటింగ్ ఏరియాలలో ఇప్పటివరకూ 171 చోట్ల ఫలితాలు వెలువడగా.. 51.3 శాతం మంది ప్రజలు విడిపోవాలని, 48.7 శాతం ప్రజలు కలిసుండాలని తీర్పు ఇచ్చినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. స్వల్ప తేడాతో కొనసాగుతున్న ఫలితాలు ఎటువైపో ఫలితాల చివరివరకూ గాని తేలే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ బ్రిటన్ వాసులు ఈయూలోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించడంతో మార్కెట్లు ఊపందుకున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brexit  capital flight  FIIs  India UK trade  India-UK connection  SEBI  Stock market  brexit  vote  counting  sanderland  result  

Other Articles